అఖిల్ ఆ పార్ట్‌కి సర్జరీ చేయించుకోబోతున్నాడా.. ఇందులో నిజమెంత?

అక్కినేని మూడో తరం వారసుడు అఖిల్ తొలిసారిగా సిసింద్రీతో వెండితెరపై మెరిసాడు. ఇక హీరోగా అఖిల్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తొలిసినిమానే దారుణమైన నిరాశని మిగిల్చింది. ఆ తర్వాత పలు సినిమాలు చేసిన కూడా అఖిల్‌కి ఒక్క మంచి హిట్ కూడా పడలేదు. లవర్ బాయ్ నుంచి యాక్షన్ హీరోయిజం వరకూ అన్నీ ట్రై చేసిన కూడా పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది.
అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున తనయుడిగా అఖిల్‌కి చాలా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా ఎందుకో అంతగా రాణించలేకపోతున్నాడు. చివరిగా ఏజెంట్ చిత్రంతో పలకరించిన అఖిల్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టాడు. సిక్స్ ప్యాక్ తో గాళ్స్ ని హృదయాల్ని ఛిద్రం చేస్తూ నానా రచ్చ చేశాడు.
ఏజెంట్ కోసం అఖిల్ చాలానే కష్టపడిన ఈ సినిమా కూడా ఎందుకో మనోడికి విజయాన్ని అందించలేకపోయింది. అయితే ఈ సారి మాత్రం పక్కా హిట్ కొట్టేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. గతంలో ఏమేం తప్పులు చేశాడో మళ్లీ అలాంటి తప్పిదాలు దొర్లకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలుస్తుంది.
మంచి కంటెంట్ తోనే బాక్సాఫీస్ బరిలో నిలవాలని పక్కా ప్లాన్ చేస్తున్న నేపథ్ంలో అఖిల్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. అఖిల్ ఎప్పుడో హీరో మెటీరియల్ అని నిరూపించుకున్నాడు.. అయితే దానికి సక్సెస్ తోడయితే.. స్టార్ హీరోగా వెలుగు వెలగడం ఖాయం. ఈ క్రమంలోనే అఖిల్ తన అందాన్ని మరింత మెరుగులు దిద్దుకునేలా చేస్తున్నాడట.
గతంలో అల్లు అర్జున్, రామ్ చరణ్ లు ముఖానికి, పెదవులకు, ముక్కుకు సర్జరీలు చేయించుకుని.. అందంగా తయారయ్యారు. వారి బాటలోనే అఖిల్ నడవనున్నట్టు తెలుస్తుంది. అఖిల్ అందంగా ఉన్నప్పటికీ ముక్కు కాస్త తేడాగా ఉందని, దాని వలన ఫేసులో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు అవి సరిగా కనిపించడం లేదని , అందుకే విదేశాలకు వెళ్లి మరీ ముక్కుకు సర్జరీ చేయించుకోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం జరుగుతుంది.మరి అఖిల్ సర్జరీ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో లేదో తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈవార్త నిజమైతే అఖిల్ సర్జరీకి ఎప్పుడు వెళతాడు అని కూడా కొందరు ముచ్చటించుకుంటున్నారు.