పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వెంక‌టేష్‌- మ‌హేష్‌.. ఫొటో వైర‌ల్

పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వెంక‌టేష్‌- మ‌హేష్‌.. ఫొటో వైర‌ల్

ద‌గ్గుబాటి స్టార్ హీరో విక్ట‌రీ వెంక‌టేష్ అంద‌రి హీరోల‌తో మంచి ర్యాపో మెయింటైన్ చేస్తాడు. ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసిన వారితోనే కాకుండా ప‌ని చేయ‌ని వారితోను చాలా స‌ర‌దాగా ఉంటారు వెంకీ. అయితే వెంకటేష్.. మహేష్ బాబుతో క‌లిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ అనే చిత్రం చేసిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రంలో పెద్దోడు, చిన్నోడుగా కనిపించి ఇద్ద‌రు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు. స్క్రీన్ పై అన్నదమ్ములుగా మంచి బాండింగ్ తో కనిపించిన వీరిద్దరూ బయట కూడా అదే బంధంతో క‌నిపిస్తూ అభిమానుల‌ని సంతోషింప‌జేస్తుంటారు. రీసెంట్‌గా వెంకీ కూతురు నిశ్చితార్థ వేడుక జ‌ర‌గ‌గా, ఆ కార్య‌క్ర‌మంలో మ‌హేష్ కూడా సంద‌డి చేశారు. సూప‌ర్ స్టార్‌ని ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు విక్ట‌రీ హీరో.

మ‌హేష్ బాబు, వెంక‌టేష్ వివాదాల‌కి దూరంగా ఉంటారు. చాలా రిజ‌ర్వ్డ్‌గా ఉంటారు. ఏదైన ప‌ని ఉంటే త‌ప్ప బ‌య‌ట కనిపించ‌రు. అయితే తాజాగా వీరిద్దరూ క్లబ్ లో పేకాటరాయళ్ళుగా దర్శనమివ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వీరి చేతిలో పేక ముక్క‌లు ఉండ‌గా, టేబుల్ మధ్యలో లక్షల రూపాయలు ఉన్నాయి. ఇది చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. అస‌లు వీరిద్ద‌రు అంత ప‌బ్లిక్‌గా ఎలా పేకాట ఆడే సాహసం చేశార‌ని అంద‌రు ముచ్చ‌టించుకుంటున్నారు. అయితే అస‌లు విష‌యం ఏంటంటే మ‌హేష్ బాబు, వెంక‌టేష్ రీసెంట్‌గా ప్రముఖ వ్యాపారవేత్త మేఘా కృష్ణారెడ్డి ఏర్పాటు చేసిన ఓ ప్రైవేట్ పార్టీకి హాజరయ్యారు. ఆ పార్టీలో కాసేపు సరదాగా పేకాట ఆడగా,ఆ సమయంలో ఎవరో దూరం నుండి ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్ట‌డంతో ఇప్పుడు ఈ పిక్ సోష‌ల్ మీడియాని షేక్ చేస్తుంది.

పేకాట ఆడుతూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన వెంక‌టేష్‌- మ‌హేష్‌.. ఫొటో వైర‌ల్ఇక పార్టీలో వెంక‌టేష్‌తో క‌లిసి దిగిన పిక్ షేర్ చేసిన మ‌హేష్ బాబు.. “పెద్దోడు పక్కన ఉంటే చాలా సరదాగా ఉంటుంది” అంటూ ఇద్ద‌రు క‌లిసి దిగిన‌ ఒక ఫోటో షేర్ చేశాడు. ఆ పిక్ లో వెంకీ అండ్ మహేష్ కలిసి చాలా కూల్ గా కనిపిస్తున్నారు. ఫొటోలోని ఇద్దరి లుక్స్ కూడా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. వీరిద్దరి కాంబినేషన్ లో మళ్ళీ ఇంకో సినిమా వస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. వెంకటేష్ సైంధవ్ టైటిల్ తో యాక్షన్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. దర్శకుడు శైలేష్ కొలను ఈ మూవీని ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం జ‌నవరి 13 న విడుద‌ల కానుంది. మ‌హేష్ న‌టించిన గుంటూరు కారం చిత్రం కూడా సంక్రాంతి బ‌రిలో నిల‌వ‌నుంది.