స్విమ్ సూట్ వేసుకున్న‌ప్పుడు బ‌య‌ట‌కి రాలేక‌పోయాను.. వాళ్ల‌కి మాత్రం దండం పెట్టాలి..!

  • Publish Date - January 21, 2024 / 07:00 AM IST

న‌టి మీనా గురించి ఈ త‌రం వారికి అంత పెద్ద‌గా తెలిసి ఉండ‌క‌పోవ‌చ్చు కాని, అప్ప‌ట్లో టాప్ హీరోయిన్‌గా ఓ ఊపు ఊపేసింది. బాల నటిగా కెరీర్ ప్రారంభించిన మీనా స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన మీనా 90వ దశకంలో అందాల భామగా మెరిసి అల‌రించింది. తెలుగులో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో జతకట్టింది. వారికి సూపర్ హిట్స్ ఇచ్చింది. సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో బాలనటిగా నటించిన మీనా… ఆయన పక్కనే ముత్తు సినిమాలో హీరోయిన్ గా కూడా నటించింది. కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే ఈ అమ్మ‌డు బెంగళూరుకు చెందిన ఇంజనీర్ విద్యాసాగర్‌ను వివాహం చేసుకుంది.

ఇటీవలే విద్యాసాగర్ అనారోగ్యంతో మృతి చెందారు. భర్త మృతితో మీనా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. కొన్నాళ్ల‌పాటు ఆ డిప్రెష‌న్ నుండి కోలుకోలేక‌పోయింది. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి కోలుకున్న మీనా ప్ర‌స్తుతం సినిమాలు చేస్తుంది. ఇటీవ‌ల బీజేపీ పార్టీలో కూడా చేర‌నుందంటూ ప్ర‌చారం జ‌రిగింది. కాని ఇప్ప‌టి వ‌ర‌కు దీనిపై మీనా స్పందించింది లేదు. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో మీనా త‌న వ‌య‌స్సుకు త‌గ్గ పాత్ర‌లు చేస్తూ సీనియ‌ర్ హీరోల‌తో జ‌త‌క‌డుతుంది. తమిళ్ రియాలిటీ షో జడ్జిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో ఆమె కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

హీరో ప్రభుదేవా తనకు గ్లామరస్ రోల్స్ చేయాలని సూచించాడ‌ట‌. స్విమ్ సూట్స్ వేసి గ్లామ‌ర్ పాత్ర‌లు చేయమ‌ని అన్నాడ‌ట‌. అయితే ఓ మూవీలో స్విమ్ సూట్ ధరించాల్సి రాగా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యిందట మీనా . స్విమ్ సూట్ ధరించి మేకప్ రూమ్ నుండి బ‌య‌ట‌కు రావడానికి చాలా ఇబ్బంది ప‌డింద‌ట‌. ఎంతో సిగ్గేసింద‌ని వాపోయింది. త‌న‌కు బోల్డ్ సీన్స్, గ్లామరస్ రోల్స్ చేయడం చాలా కష్టం. ఆ తరహా రోల్స్ చేసే వాళ్లకు దండం పెట్టాలి అని మీనా పేర్కొంది. ప్ర‌భుదేవాతో మీనా న‌టించిన చిత్రంలో స్విమ్ సూట్‌లో క‌నిపించి ర‌చ్చ చేసింది . ఇక మీనాకి నైనిక అనే అమ్మాయి ఉంది. విజయ్ హీరోగా తెరకెక్కిన తేరి మూవీలో నైనిక చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ చేయడం విశేషం. 

Latest News