తడాఖా చూపించిన ముంబై.. ఖాతాలో మరో విజయం

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్ 2024లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ నడిచింది. గురువారం యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై ఇండియన్స్ 42 పరుగుల భారీ తేడాతో గెలుపొంది తమ ఖాతాలో మరో విజాయాన్ని వేసుకుంది. తొలుత ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు బ్యాటింగ్ చేయగా, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 160 పరుగులే చేసింది. నాట్ సీవర్ బ్రంట్(31 బంతుల్లో 8 ఫోర్లతో 45), అమెలియా కేర్(23 బంతుల్లో 6 ఫోర్లతో 39), హర్మన్‌ప్రీత్ కౌర్(30 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 33) కొంత రాణించగా, మిగతా బ్యాట్స్‌మెన్స్ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. యూపీ వారియర్స్ బౌలర్లలో చమరి ఆటపట్టు(2/27) రెండు వికెట్లు తీసి గట్టి దెబ్బ కొట్టగా.. రాజశ్వేరి గైక్వాడ్, దీప్తి శర్మ, సైమా థాకోర్ తలో వికెట్ పడగొట్టారు.
ఇక యూపీ వారియర్స్ 161 పరుగుల లక్ష్య చేధనకు బరిలోకి దిగగా ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 118 పరుగులే చేసి ఓటమిపాలైంది. దీప్తి శర్మ(36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 నాటౌట్) ఒంటరి పోరాటం చేసిన కూడా మిగతా బ్యాటర్లు ఎవరు ప్రతిఘటన చూపించకపోవడంతో యూపీ వారియర్స్ 42 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ముంబై బౌలర్లలో షైకా ఇషాక్(3/27) మూడు వికెట్లు తీసి సత్తా చాటగా .. నాట్ సీవర్ బ్రంట్(2/14), రెండు వికెట్లు, షబ్నిమ్ ఇస్మాయిల్, హీలీ మాథ్యూస్, పూజా వస్త్రాకర్, సజీవన్ సజన తలో వికెట్ తీసారు.
మొత్తానికి ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో నాలుగో విజయం నమోదు చేసుకొని పాయింట్స్ టేబులో టాప్ 2కి దూసుకెళ్లింది. ఇక యూపీ వారియర్స్ జట్టు నాలుగో ఓటమిని తమ ఖాతాలో వేసుకుంది. ఈ జట్టులో మంచి ఆటగాళ్లు ఉన్నప్పటికీ సరైన ప్రదర్శించని కారణంగా యూపీ వారియర్స్ ఓటమి చెందాల్సిన పరిస్థితి వస్తుంది. రానున్న మ్యాచ్‌లలో అయిన ఆ జట్టు సమిష్టిగా రాణించి మంచి విజయాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.