అమర్ ఫౌల్ గేమ్ కళ్లకిగట్టినట్టు చూపించిన నాగార్జున.. గౌతమ్‌కి చురకలు

బిగ్ బాస్ సీజన్ 7 13వ వారం కూడా పూర్తి కావొచ్చింది. సోమవారంతో 14వ వారంలోకి అడుగుపెట్టనుండగా, ఆ తర్వాత ఫినాలేకి కేవలం ఒకే ఒక్కవారం మిగిలి ఉంది. ఎవరు కప్ కొడతారు, టాప్ 5లో ఎవరు ఉంటారు అనే దానిపై ఇప్పటి నుండే జోరుగా చర్చలు సాగుతున్నాయి. అయితే శనివారం ఎపిసోడ్‌లో నాగార్జున ఎంట్రీ ఇవ్వగా, షో సందడిగా సాగింది. ముందుగా ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన అర్జున్‌ని అభినందించారు. ఎవరి సపోర్ట్ లేకుండా సోలోగా ఆడి ఫైనలిస్ట్ అయ్యావు అంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక శివాజీ, శోభలని లేపి వారు ఎందుకు సరిగ్గా గేమ్ ఆడలేదో అడిగాడు. దానికి వారు తగు కారణాలు చెప్పారు. ఇక ప్రియాంక ఆడే డబుల్ గేమ్ లను, గౌతమ్.. అమర్, శోభాకి సపోర్ట్ చేయడంపై ప్రియాంకని నిలదీయకపోవడంపై నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక అమర్ దీప్ ఫౌల్ గేమ్ ఎలా ఆడాడో కూడా కళ్లకి కట్టినట్టు చూపించారు నాగార్జున. అయితే తనని ఒక్కసారైన కెప్టెన్ అమర్ దీప్ అని పిలవాలని నాగార్జునని కోరగా, మూడు సార్లు పిలిచి ఏకంగా కెప్టెన్‌ని కూడా చేశాడు. అర్జున్ తర్వాత అత్యధిక పాయింట్లు సాధించి రెండో స్థానంలో ఉన్న అమర్ దీప్ కోరిక మేరకు వచ్చే వారం కెప్టెన్‌గా అమర్‌ని నాగార్జున కెప్టెయిన్‌గా అపాయింట్ చేశాడు. దీంతో అమర్ ఆనందానికి అవదుల్లేవు. కాకపోతే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. ఇంతకు ముందులా కెప్టెన్‌కి వచ్చే ఇమ్యూనిటీ అమర్ దీప్‌కి దక్కదు. అలాగే శోభ, ప్రియాంకలను అసిస్టెంట్లు గా పెట్టుకోకూడదే కండీషన్ పెట్టడంతో శివాజీ, అర్జున్‌లను తనకు సహాయకులుగా నియమించుకున్నాడు అమర్.
అయితే వారిద్దరు కూడా అమర్ సహాయకులుగా ఉండమని చెప్పగా, నాగార్జున మాటకి వాళ్లు కట్టుబడి అందుకు ఒప్పుకున్నారు. అనంతరం బుక్‌లను అంకితం చేసే టాస్క్ నిర్వహించగా, ఈ టాస్క్‌లో భాగంగా ఒక్కో క్వాలిటీతో ఒక్కో బుక్కులో దాన్ని వారు పాటించడం, తగ్గించుకోవడం చేయాల్సి ఉంటుంది.ఇది ఎవరికి ఇవ్వాలని అనుకుంటున్నారో వారికి ఇచ్చి తగు కారణం చెప్పాల్సి ఉంటుంది. ముందుగా శోభా..సొంతంగా ఆడటం ఎలా ? అని తెలియజేసే బుక్‌ని ప్రియాంకకి ఇస్తుంది. అనంతరం ప్రియాంక.. బ్రెయిన్ ఉపయోగించి ఆడటం ఎలా ? అనేది యావర్‌కి ఇచ్చింది. యావర్.. నెగటివి వ్యాప్తించకుండా చూడటం ఎలా ? అనే పుస్తకాన్ని శోభాకి ఇచ్చాడు. అమర్.. సరైన కారణాలతో నామినేట్ చేయడం ఎలా అని ప్రశాంత్‌కి ఇచ్చారు. ఆ తర్వాత ప్రశాంత్.. గయ్యాలి కాకుండా గమ్మున ఉండటం ఎలా అనేది అమర్ దీప్‌కి ఇచ్చాడు. గౌతమ్.. ప్రతి దాన్నిరైట్స్ అనుకోకుండా ఉండటం ఎలా ? అనే పుస్తకాన్ని శివాజీకి ఇచ్చాడు. శివాజీ.. కుళ్లు కుతంత్రాలు లేకుండా ఉండటం ఎలా అనేదాన్ని గౌతమ్‌కి ఇచ్చాడు. అర్జున్.. ఎక్స్ ట్రాలు ఆపడం ఎలా ? అనే పుస్తకాన్ని అమర్ దీప్‌కి ఇచ్చాడు. ఇలారెండు పుస్తకాలు వచ్చాయి. దీంతోపాట్ నాగార్జున కూడా నిజాలు చెప్పడం ఎలా అనే పుస్తకాన్ని అమర్‌కి ఇచ్చాడు.