Smriti Mandhana Cancels Wedding With Palash Muchhal: నా పెళ్లి రద్దు..ప్రకటించిన స్మృతి మంధాన

భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన, తన పెళ్లిపై వస్తున్న ఊహాగానాలకు తెరదించారు. మ్యూజిక్ డైరెక్టర్ పలాశ్ ముచ్చల్‌తో జరగాల్సిన తన వివాహాన్ని రద్దు చేసుకున్నట్లుగా ఆమె అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు.

Smriti Mandhana Cancels Wedding With Palash Muchhal: నా పెళ్లి రద్దు..ప్రకటించిన స్మృతి మంధాన

విధాత : భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా తన పెళ్లిపై కీలక ప్రకటన చేశారు. మ్యూజిక్‌ డైరెక్టర్‌ పలాశ్‌ ముచ్చల్‌ తో జరుగాల్సిన తన పెళ్లి రద్దు చేసుకున్నట్లుగా ఆమె అధికారికంగా ప్రకటించారు. ఇన్ స్టా వేదికగా స్మృతి తన పెళ్లి రద్దు విషయాన్ని వెల్లడించారు.

మహిళ క్రికెట్ ప్రపంచ కప్ విజయం అనంతరం తన ప్రియుడు మ్యూజిక్‌ డైరెక్టర్‌ పలాశ్‌ ముచ్చల్‌తో పెళ్లికి స్మృతి సిద్దపడింది. నవంబర్‌ 23న జరగాల్సిన వారిపెళ్లి వేడుక..స్మృతి తండ్రి అస్వస్థతో పాటు పలు కారణాలతో అర్ధాంతరంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. తర్వాత పలాశ్ వేరే అమ్మాయితో స్మృతి గురించి చేసిన చాట్‌లు వైరల్ అయ్యాయి. ఆ వెంటనే ఎంగేజ్‌మెంట్, పెళ్లికి సంబంధించిన వీడియోలు స్మృతి తన సోషల్ మీడియా ఖాతాల్లోంచి తొలగించడంతో పెళ్లి రద్దు అనే వార్తలు జోరందుకున్నాయి. స్మృతి స్నేహితురాళ్లు శ్రేయాంక, జెమీమా కూడా పెళ్లి వేడుకలకు సంబంధించి వీడియోలు తొలగించారు. ఈ నేపథ్యంలో తన పెళ్లిపై స్మతి మంధానా తాజాగా స్పష్టమైన ప్రకటన చేసింది.

‘గత కొన్ని వారాలుగా నా జీవితం చుట్టూ చాలా ఊహాగానాలు సాగాయి. ఇలాంటి సమయంలో నేను మాట్లాడటం చాలా ముఖ్యం. నా గురించి అన్నీ గోప్యంగా ఉండాలని భావించే వ్యక్తిని. కానీ ఇప్పుడు నేను స్పందించాల్సిన సమయం వచచింది. .నా వివాహం రద్దయిందని అందరికీ స్పష్టం చేయాలనుకుంటున్నాను. పలాశ్‌ను నేను పెళ్లి చేసుకోవట్లేదు. ఈ విషయాన్ని ఇక్కడితో ముగిస్తారని భావిస్తున్నానని తెలిపింది. రెండు కుటుంబాల గోప్యతను గౌరవించి.. ముందుకు సాగేందుకు స్పేస్‌ ఇవ్వాలని అభ్యర్థించింది. దేశాన్ని అత్యున్నత స్థాయిలో ఉంచేందుకు ముందుకు సాగుతానని..భారత్‌ తరఫున మరిన్ని మ్యాచ్‌లు ఆడి ట్రోఫీలు గెలుస్తానని.. నాకు మద్దతిచ్చిన అందరికీ ధన్యవాదాలు అని పేర్కొంది. ముందుకు సాగాల్సిన సమయం ఆసన్నమైంది’ అని స్మృతి తన ఇన్ స్టా పోస్టులో రాసుకొచ్చింది.

ఇవి కూడా చదవండి :

Praja Palana Vijayotsavam Celebrations : ప్రజాపాలన విజయోత్సవాలు వర్సెస్ విజయ్ దివాస్
Sashirekha Lyrical Song : ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ నుంచి ‘శశిరేఖ’ సాంగ్ రిలీజ్