Site icon vidhaatha

52 ఏళ్ల వ‌య‌స్సులో అందాల‌తో మ‌త్తెక్కిస్తున్న న‌మ్ర‌త‌.. మోడ్ర‌న్ లుక్‌లో మాయ చేస్తుందిగా..!

సూప‌ర్ స్టార్ భార్య న‌మ్ర‌త శిరోద్క‌ర్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. 1993లో మిస్ ఇండియాగా ఎంపికై ఆ తర్వాత హీరోయిన్ గా పలు సినిమాలు చేసింది. ఇక మ‌హేష్ బాబుతో వంశీ సినిమా షూటింగ్ టైంలో ప్రేమ‌లో ప‌డిన న‌మ్ర‌త అత‌డిని 2005లో వివాహం చేసుకుంది. మ‌హేష్‌, న‌మ్ర‌త దంప‌తుల‌కి గౌత‌మ్, సితార అనే ఇద్ద‌రు చిన్నారులు ఉన్నారు. అయితే ప్ర‌స్తుతం మ‌హేష్‌కి వ్య‌క్తిగ‌త స‌ల‌హ‌దారుగా ఉన్న న‌మ్ర‌త సోష‌ల్ మీడియాలో అందాల ప్ర‌కంప‌న‌లు పుట్టిస్తుంది. 52 ఏళ్ల వ‌య‌స్సులో న‌మ్ర‌త ర‌చ్చ చూసి అంద‌రు షాక్ అవుతున్నారు. 52 ఏళ్ల వ‌య‌స్సులో ఎవ‌రైన కాస్త ముస‌లి ముఖంతో క‌నిపిస్తారు.

కాని న‌మ్ర‌త మాత్రం రోజురోజుకి చాలా యంగ్‌గా క‌నిపిస్తుంది.. పాతికేళ్ల పడుచు పిల్లలా కనిపిస్తూ కుర్రకారు కళల రాణిగా ఇంకా కొనసాగుతోంది. భర్త మహేష్ బాబు లాగే ఈమె కూడా స్పెషల్ డైట్ ఫాలో అవుతూ తన అందాన్ని కాపాడుకుంటూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. న‌మ్ర‌త నిత్యం జిమ్‌లో క‌స‌ర‌త్తులు చేస్తూ త‌న అందాన్ని కాపాడుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ తాజాగా అల్ట్రా మోడ్రన్ లుక్ లో కేక పెట్టిస్తూ ప్ర‌తి ఒక్క‌రి మ‌న‌సులు కొల్ల‌గొడుతుంది. వైట్ కలర్ హ్యాండ్ బ్యాగ్ వేసుకుని మరింత స్టైలిష్ లుక్ లో ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ పిక్స్ చూసి ప్రతీ ఒక్కరూ చాలా బాగున్నారు, అందంగా ఉన్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

న‌మ్ర‌త షేర్ చేసిన పిక్స్‌కి కామెంట్ల వ‌ర్షం కురుస్తుంది. లేడీ బాస్ గెటప్ లో సూపర్ స్టైలిష్ గా దర్శనం ఇచ్చింద‌ని నెటిజ‌న్స్ కామెంట్స్ చేస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్‌ తో పాటు నమ్రతా ఫ్యాన్స్ ఈ ఫొటోలకు లైకులు కొడుతూ రచ్చ చేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో న‌మ్ర‌త వెరైటీ లుక్స్‌తో ఫొటో షూట్ చేస్తూ నెటిజ‌న్స్‌కి మంచి కనువిందు చేస్తుంది. ఇంటిని, భర్తను, పిల్లలను చూసుకోవడంతో ఫుల్ బిజీగా ఉండే న‌మ్ర‌త ఇలా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ అంద‌రిని అల‌రిస్తుండ‌డం గ్రేట్ అని అని అంటున్నారు.

Exit mobile version