రాజకీయాల్లోకి నేహా శర్మ.. ఆ ఎంపీ స్థానం నుంచి పోటీకి రెడీ..!
ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడేందుకు చాలా మంది నటులు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నటి నేహా శర్మ రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఈ విషయాన్ని నేహా శర్మ తండ్రే ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.
సినీ నటీనటులు చాలా మంది రాజకీయాల్లోకి వచ్చారు. అలా వచ్చిన వారిలో ముఖ్యమంత్రులు అయినా వారూ ఉన్నారు. పార్లమెంట్‌కు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన వారూ ఉన్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ పడేందుకు చాలా మంది నటులు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా నటి నేహా శర్మ రాజకీయాల్లోకి రాబోతున్నారు. ఈ విషయాన్ని నేహా శర్మ తండ్రే ఓ మీడియా సమావేశంలో వెల్లడించారు.
నేహా శర్మ తండ్రి అజిత్ శర్మ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. బీహార్‌లోని భాగల్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీహార్‌లో ఆర్జేడీ – కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నాయి. సీట్ల పంపకాలు జరగాల్సి ఉంది. అయితే భాగల్‌పూర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. కాంగ్రెస్ అధిష్టానం నన్ను పోటీ చేయాలని ఆదేశిస్తే కచ్చితంగా పోటీ చేస్తాను.. లేదా నా కుమార్తె నేహా శర్మ ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చు అని ఆయన తెలిపారు. దీనిపై కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అజిత్ శర్మ అన్నారు. దీంతో నేహా శర్మ త్వరలోనే పొలిటికల్ ఎంట్రీ ఖాయమైంది.
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ హీరోగా నటించిన తొలి సినిమా చిరుతలో నేహా శర్మ హీరోయిన్‌గా నటించింది. ఆ తరువాత కొన్ని తెలుగు సినిమాల్లో నటించినప్పటికీ నేహా శర్మ కెరీర్‌కు అవి దోహదపడలేదు. దీంతో అవకాశాలు లేక ప్రస్తుతం ఖాళీగానే ఉంటోంది ఈ బ్యూటీ.
Congress MLA Ajeet Sharma wants his daughter and actress Neha Sharma to contest Loksabha election from parliamentary constituency of Bhagalpur, Bihar.
He wants this seat to be allocated to Congress in alliance. pic.twitter.com/IFoiw3lzVR
— Shantanu (@shaandelhite) March 22, 2024
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram