ఎన్టీఆర్ ఇద్దరు పిల్లల స్కూలు ఫీజులు ఎంతో తెలిస్తే ఉలిక్కిపడడం ఖాయం..!

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు. ఆయనకి టెంపర్ తర్వాత వరుస విజయాలు దక్కుతున్నాయి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ దక్కించుకున్నాడు. చిత్రంలో ఎన్టీఆర్ పర్‌ఫార్మెన్స్‌కి మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం జూనియర్ దేవర అనే చిత్రంతో బిజీగా ఉన్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, ఈ చిత్రం అమ్మడికి తొలి చిత్రం. అయితే ఎన్టీఆర్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి విలువైన సమయం కేటాయిస్తుంటాడు.
తన పిల్లలు, భార్యతో సరదాగా గడుపుతుంటాడు. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అయితే తాజాగా ఎన్టీఆర్ పిల్లలకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. తారక్ ఇద్దరు కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా వీళ్లిద్దరికీ బాలనటులుగా ఎప్పుడు అలరిస్తారా అని ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా అభయ్ రామ్, భార్గవ రామ్ స్కూల్ ఫీజులకు సంబంధించి ఒక వార్త ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ ఇద్దరు కొడుకుల స్కూల్ ఫీజు ఏడాదికి 20 లక్షల రూపాయలు అని ప్రముఖ స్కూల్స్ లో తారక్ పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారని ఇప్పుడు ఒక వార్త నెట్టింట హల్‌చల్ చేస్తుంది.
ఎన్టీఆర్ పెద్ద కొడుకు అభయ్ రామ్ ఐదవ తరగతి చదువుతుండగా… చిన్న కొడుకు భార్గవ్ రామ్ ఒకటవ తరగతి చదువుతున్నారు. ఇద్దరు కూడా హైదరాబాదులోని ఒక కార్పొరేట్ స్కూల్లో విద్యను అభ్యసిస్తుండగా, వారి . ప్రైమరీ విద్య కోసమే ఈ రేంజ్ లో ఖర్చు చేస్తున్నారు ఎన్టీఆర్. పిల్లలు పై చదువులు వెళ్లేసరికి ఇంకా ఎంత కట్టాల్సి వస్తుందో అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఎన్టీఆర్ పిల్లల స్కూల్ ఫీజుతో కొన్ని మధ్య తరగతి కుటుంబాలు సంతోషంగా బ్రతికేస్తాయి అంటూ నెటిజన్స్ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.