బాలీవుడ్‌లో బిజీ కాబోతున్న ఎన్టీఆర్.. ఈ సారి స్ట్రైట్ మూవీతో సంద‌డి

  • By: sn    breaking    Mar 06, 2024 12:27 PM IST
బాలీవుడ్‌లో బిజీ కాబోతున్న ఎన్టీఆర్.. ఈ సారి స్ట్రైట్ మూవీతో సంద‌డి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రానున్న రోజులలో మ‌రింత బిజీ కాబోతున్నాడు. ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియ‌ర్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. చిత్రంలో ఎన్టీఆర్ న‌ట‌న‌కి దేశ విదేశాల నుండి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. త్వ‌ర‌లో కొర‌టాల శివ‌తో దేవ‌ర అనే సినిమా చేయ‌నుండ‌గా, ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మ‌రింత పెర‌గడం ఖాయ‌మ‌ని అంటున్నారు. భారీ ఎత్తునే ఈ మూవీని ప్లాన్ చేస్తుండ‌గా, ఈ సినిమా హిట్టైతే మాత్రం ఎన్టీఆర్ క్రేజ్ ఓ రేంజ్‌కి వెళుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఎన్టీఆర్‌ నెక్ట్స్ సినిమాల లైనప్‌ మామూలుగా లేదు. ఆయన సైలెంట్‌గా భారీ లైనప్‌ని సెట్‌ చేసుకుంటూ అందరిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తున్నాడు. బాలీవుడ్‌తోపాటు తమిళం, కన్నడ, మలయాళ ఆడియెన్స్ కి కూడా మ‌రింత ద‌గ్గ‌ర‌వ్వాల‌ని ఎన్టీఆర్ చూస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఎన్టీఆర్‌కి సంబంధించిన వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇప్పటికే హిందీలో `వార్‌ 2`లో నటించేందుకు ఎన్టీఆర్ ఓకే చెప్పిన విష‌యం తెలిసందే. అయాన్‌ ముఖర్జీ దర్శకత్వం వహించే ఈ మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్ త్వ‌ర‌లోనే జాయిన్ కానున్నాడు. హృతిక్‌తో క‌లిసి సంద‌డి చేయ‌నున్నాడు. స్పై ఏజెంట్ పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించి సంద‌డి చేయ‌నున్నాడ‌ని టాక్.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఫుల్ లెంగ్త్ రోల్‌లో స్ట్రెయిట్‌ బాలీవుడ్‌ మూవీ చేయబోతున్నారని తెలుస్తుంది. స్పై యూనివర్స్ సిరీస్‌లో ఈ మూవీ రానుండ‌గా, ఈ మూవీకి సైన్ చేసిన‌ట్టు కూడా టాక్ వినిపిస్తుంది.ఈ ప్రాజెక్ట్ కన్ఫమ్‌ అయినట్టు త్వ‌ర‌లోనే ఓ అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న కూడా రానుంద‌ని స‌మాచారం. వార్‌ 2 పూర్తయిన తర్వాత ఈ మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్ పాల్గొన‌నున్నాడ‌ని టాక్. యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించ‌నుంద‌ని, ఇది ప్రేక్ష‌కుల‌కి మంచి ఫీస్ట్‌గా మార‌నుంద‌ని అంటున్నారు.ఈ రూమర్ వినే నంద‌మూరి అభిమానుల‌కి గూస్ బంప్స్ వ‌స్తున్నాయి. మ‌రి నిజ‌మైతే మాత్రం వారి ఆనందానికి అవ‌ధులు ఉండ‌వనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ న‌టించిన దేవ‌ర దసరా కానుకగా అక్టోబర్‌ 10న విడుదల కానుంది. రెండు భాగాలుగా చిత్రాన్ని రిలీజ్ చేయ‌నున్నట్టు టాక్.