ఏంటి.. పూనమ్ పాండే చనిపోలేదా.. ఇదంతా పీఆర్ స్టంటేనా?

హాట్ బాంబ్ పూనమ్ పాండే 32 ఏళ్ళ వయసులో సర్వైకల్ క్యాన్సర్ తో పోరాడి మరణించినట్టు ఆమె మేనేజర్ ప్రకటించగా, ఈ విషయం తెలుసుకొని ప్రతి ఒక్కరు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంత చిన్న వయస్సులో ఆమె అలా మరణించడం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ఆమె మృతి చెందినట్టు సమాచారం. అయితే దీనినే గర్భాశయ క్యాన్సర్ అని కూడా పిలుస్తారు. దీనికి వ్యాక్సిన్ కూడా ఉంది. కానీ ఈ క్యాన్సర్‌పై అవగాహన లేకపోవడంతో చాలామంది ఈ వ్యాధి బారిన పడి మృతి చెందుతున్నారు. తాజాగా పూనమ్ పాండే కూడా ఈ క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటూ చివరి దశలో మృతి చెందినట్లు ఆమె మేనేజర్ చెప్పుకొచ్చారు.
అయితే పూనమ్ పాండే మృతిపై అనేక అనుమానాలు నెలకొన్నాయి. సర్వైకల్ క్యాన్సర్‌తో చనిపోయినట్టు ఆమె అకౌంట్ లో పెట్టిన పోస్ట్ లో ఉంది. అయితే దీనిపై అవగాహన ఉన్న వాళ్లు మాత్రం అలా చనిపోవడం అసంభవం అంటున్నారు. సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన వాళ్ల వయస్సు 50 ఏళ్ల లోపు ఉంటే ట్వీట్‌మెంట్ ద్వారా బ్రతికే ఛాన్స్ ఉంది. పూనమ్ వయస్సు 32 ఏళ్లే కాగా, ఆమె మరణించడంలో ఏదో ట్విస్ట్ ఉందని అంటున్నారు. ఇక ఇటీవలే ఆమెకి పెళ్లి కావడం భర్తతో గొడవలు, పోలీస్ స్టేషన్ వరకు ఈ గొడవలు వెళ్లడం మనం చూసాం. అయితే ఆమె పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయింది కాబట్టి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండదు అని కొందరు చెబుతున్న మాట.
సర్వైకల్ కాన్సర్ సెక్స్ లో పాల్గొన్న తర్వాత వచ్చే అవకాశం ఉంటుందని, భర్తతో లేదు కాబట్టి అది సాధ్యం కాదు అంటున్నారు.ఇంకో వాదన ఏంటంటే.. ఈ కాన్సర్ వచ్చిన వెంటనే ప్రాణాలు పోవడం జరగదని, కొన్నేళ్ల తర్వాత, అది పీక్ స్టేజ్‌లోకి వెళ్లాక జరుగుతుంది. దీనికి కొన్నేళ్లు పడుతుందని అంటున్నారు. పూనమ్ పాండే చనిపోవడమనేది చాలా వరకు ఫేక్ న్యూస్ ..ఇదంతా పీఆర్ స్టంట్‌గా చెబుతున్నారు.. పూనమ్ పాండే మరణంలో నిజం ఉంటే కచ్చితంగా దీనిపై విచారణ జరిపించాలని అంటున్నారు. అదే సమయంలో చావుతో చెలగాటం ఆడుతారా? అని కొందరు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇందులో పెద్ద మోసం ఉండి ఉంటుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు బయటకు రాబట్టాల్సి ఉందని కొందరు డిమాండ్ చేస్తున్నారు.