Pregnant Girl | గర్భం దాల్చిన బాలిక.. నిప్పంటించిన తల్లి, సోదరుడు
Pregnant Girl | గర్భం దాల్చిన ఓ బాలిక పట్ల ఆమె తల్లి, సోదరుడు క్రూరంగా ప్రవర్తించారు. అడవికి తీసుకెళ్లి ఆ బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని హపూర్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హపూర్ జిల్లాలోని నవడా ఖుర్ద్ గ్రామానికి చెందిన ఓ 17 ఏండ్ల బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం ఆమె తల్లికి, సోదరుడికి తెలిసింది. దీంతో బాలికపై వారిద్దరూ కన్నెర్రజేశారు. తమ పరుగు తీశావంటూ రగిలిపోయారు. బాలికను అడవిలోకి తీసుకెళ్లి, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. 70 శాతం కాలిన గాయాలతో బాధపడుతున్న ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తల్లి, సోదరుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే బాలికకు అదే గ్రామానికి ఓ వ్యక్తితో ఏర్పడిన పరిచయం, శారీరక సంబంధానికి దారి తీసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆమె గర్భం దాల్చినట్లు తేలింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram