Kidney Gift | సోదర సోదరీ ప్రేమ అంటే ఇదే కదా..! అక్కకు తమ్ముడు.. తమ్ముడికి అక్క కిడ్నీలను దానం చేసి కథలివి..!

Kidney Gift | సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. తోబుట్టువుల మధ్య కల్మషం లేని బంధానికి గుర్తుగా, ఆత్మీయత అనురాగాల మధ్య దేశవ్యాప్తంగా అట్టహాసంగా రక్షాబంధన్‌ ఘనంగా జరిగింది. అయితే, సోదరుడి చేతికి సోదరి రాఖీ కడుతుంది. రక్షబంధన్‌ అంటే అన్నామ్ముళు ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకోవడం అని అర్థం.

Kidney Gift | సోదర సోదరీ ప్రేమ అంటే ఇదే కదా..! అక్కకు తమ్ముడు.. తమ్ముడికి అక్క కిడ్నీలను దానం చేసి కథలివి..!

Kidney Gift | సోదర సోదరీమణుల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ. తోబుట్టువుల మధ్య కల్మషం లేని బంధానికి గుర్తుగా, ఆత్మీయత అనురాగాల మధ్య దేశవ్యాప్తంగా అట్టహాసంగా రక్షాబంధన్‌ ఘనంగా జరిగింది. అయితే, సోదరుడి చేతికి సోదరి రాఖీ కడుతుంది. రక్షబంధన్‌ అంటే అన్నామ్ముళు ప్రతి పనిలోనూ విజయం సాధించాలని కోరుకోవడం అని అర్థం. అయితే, అలాగే, అన్నాదమ్ముళు ఏ కష్ట సుఖాల్లో తోబుట్టువులకు రక్షగా నిలుస్తారని అర్థం. అయితే, రక్షాబంధన్‌ రోజున అరుదైన ఘటన వెలుగులోకి వచ్చింది. 43 సంవత్సర మహిళకు రక్షాబంధన్‌ రోజున ఆమె సోదరుడు తన ప్రాణాలను నిలిపేందుకు కిడ్నీనే దానంగా ఇచ్చాడు. ఈ ఘటన దక్షిణ గోవాలో చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. సదరు మహిళ పాలిసిస్టిక్ కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది. వెంటనే ఆమెకు కిడ్నీని మార్చాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

సోదరిపడుతున్న బాధను చూడలేక ఆమె సోదరుడు కిడ్నీ ఇచ్చేందుకు ముందుకువచ్చాడు. అంతకు ముందు ఆయనకు కిడ్నీ సమస్యలు ఉన్నాయి. దాంతో దానికి ట్రీట్మెంట్‌ చేయించుకొని మరి తన కిడ్నీని సోదరికి దానం చేశాడు. ఆ తర్వాత ఓ కిడ్నీని తన సోదరికి ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. ఇటీవల వైద్యులు ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఆమె సోదరుడికి సైతం పెళ్లి కాగా.. కిడ్నీ దానానికి భార్య సైతం అడ్డు చెప్పకపోవడం విశేషం. రాఖీ పండుగ నేపథ్యంలో ఆ సోదరుడు రాఖీని కట్టుకునేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. సోదరి అతనికి రాఖీ కట్టి ఎమోషనల్‌ అయ్యింది. తన సోదరుడు లేకపోతే తాను జీవించి ఉండేదాన్ని కాదని కన్నీళ్లు పెట్టుకున్నది. అక్కా తమ్ముడు ఇద్దరు చిన్ననాటి నుంచి ఎంతో ప్రేమగా ఉండేవారని సదరు మహిళ భర్త తెలిపాడు. ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది.

మహారాష్ట్రలో తమ్ముడికి కిడ్నీ ఇచ్చిన అక్క

మహారాష్ట్రలోని పింప్రీలో మరో ఘటన చోటు చేసుకున్నది. ఓ 36 ఏళ్ల మహిళ తన కిడ్నీని తన తమ్ముడికి దానం చేసింది. తమ్ముడు మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. ప్రాణపాయ స్థితిలో హిమోడయాలసిస్‌పై ఉండగా.. సోదరి కిడ్నీని దానం చేసి ప్రాణాలను నిలిపింది. యువకుడి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. సమస్య కారణంగా ఊపిరి ఆడకపోవడం తదితర సమస్యలతో కిడ్నీని మార్పు చేయాలని వైద్యులు సూచించారు. అయితే, మొదట తల్లి తన కిడ్నీని దానం చేసేందుకు ముందుకు వచ్చింది. పరీక్ష నిర్వహించగా ఆమె కిడ్నీ సరిపోదని తేలింది. ఆ తర్వాత అతని సోదరి ముందుకు కాగా.. కిడ్నీ సరిపోలింది. ఆ తర్వాత మల్టీ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ వృషాలి పాటిల్ ఈ నెల 8న కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ విజయవంతంగా నిర్వహించారు. నాలుగు రోజుల పాటు ఇద్దరి పరిశీలనలో ఉంచారు. ప్రస్తుతం ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. దీనిపై డాక్టర్‌ స్పందిస్తూ యువకుడు కార్డియోలపల్మోనరీ వైఫల్యంతో బాధపడుతున్నాడని.. ఈ పరిస్థితులో సోదరి ముందుకు వచ్చి కిడ్నీ దానం చేయడం ప్రశంసనీయమన్నారు. ఆమె కిడ్నీ సరిగ్గా సరిపోయిందని.. ఫలితంగా ఓ ప్రాణాన్ని నిలబెట్టగలిగామన్నారు.