Prof Papi Reddy | వీడియో : తెలంగాణ ఉద్యమకారుడు ప్రొఫెసర్ టీ పాపిరెడ్డితో విధాత ప్రత్యేక ఇంటర్వ్యూ
Prof Papi Reddy | తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తమ ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం కావాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మార్చాలన్న అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని అర్థం అవుతున్నది. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న తెలంగాణ వాదులంతా ఏకం అవుతున్నారు. ఎవరికి వారుగా భావజాల వ్యాప్తి చేస్తున్నారు. ఇప్పటికే […]
Prof Papi Reddy |
తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. తమ ఆకాంక్షలు నెరవేర్చే ప్రభుత్వం కావాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగులు, యువకులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే వివిధ వర్గాల ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని మార్చాలన్న అభిప్రాయంతో ప్రజలు ఉన్నారని అర్థం అవుతున్నది.
ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్న తెలంగాణ వాదులంతా ఏకం అవుతున్నారు. ఎవరికి వారుగా భావజాల వ్యాప్తి చేస్తున్నారు. ఇప్పటికే వివిధ వర్గాలలో ఉన్న బుద్ధి జీవులు ఈ ప్రభుత్వాన్ని మార్చాలన్న అభిప్రాయంతో ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు తెలంగాణ వాదులంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. బీఆర్ఎస్ సర్కారును మార్చాలని అనుకుంటున్న ప్రజలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో కాంగ్రెస్ పార్టీనే రావాలని కోరుకుంటన్నట్టు కనిపిస్తున్నది.
తెలంగాణ వ్యాప్తంగా అనేక చోట్ల నేను పర్యటించాను. ఎవరితో మాట్లాడినా బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనే అంటున్నారు. మొదట్లో రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ నిలబడుతుందని భావించారు కానీ, ఈ మధ్య జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న ప్రజలు బీజేపీ, బీఆర్ఎస్ మధ్య అవగాహన ఉందని అనుమానిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా నిలబడేది కాంగ్రెస్ అనే అభిప్రాయంతో ప్రజలున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram