ఏంటి..సైంధ‌వ్ హీరోయిన్‌కి విరాట్ కోహ్లీ బావ అవుతాడా..ఏమ‌ని చెప్పిందంటే..!

ఏంటి..సైంధ‌వ్ హీరోయిన్‌కి విరాట్ కోహ్లీ బావ అవుతాడా..ఏమ‌ని చెప్పిందంటే..!

విక్టరీ వెంక‌టేష్ సైంధ‌వ్ సినిమాతో సంక్రాంతి కానుకగా ప్రేక్ష‌కులని ప‌ల‌క‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు. వెంకీ 75వ సినిమాగా ఈ మూవీ రూపొందుతుంది.శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా జనవరి 13న థియేటర్స్ లోకి రాబోతుంది. ఈ సినిమాలో రుహాణి శర్మ ఓ డాక్టర్ పాత్ర చేయ‌గా, మూవీ ప్ర‌మోష‌న్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటుంది. చి॥ల॥సౌ’, ‘హిట్ ’చిత్రాలతో తెలుగులో మంచి గుర్తింపును సంపాదించుకున్న రుహానీ .. వెంకీ ‘సైంధవ్‌’ చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నది. చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయిక. తాజాగా రుహానీ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ…. వెంకటేష్ గారివి చాలా సినిమాలు చూశాను. ఎక్కువగా హిందీ డబ్బింగ్ సినిమాలు చూశాను.

వెంకటేష్ గారంటే అభిమానం ఉంది. చిన్నప్పుడు నేను డాక్టర్ అవ్వాలి అనుకున్నా. కానీ తర్వాత నా డ్రీమ్ మారిపోయి ఇలా యాక్టర్ అయ్యాను. సైంధవ్‌ సినిమాలో డాక్టర్ గా చేయడం ఆనందంగా అంది. ఇలా అయినా నా చిన్నప్పటి డ్రీం నెరవేరింది అని చెప్పుకొచ్చింది రుహాని.ఇక బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శ‌ర్మ మీకు సిస్టర్ అవుతుంది, విరాట్ బావ అవుతాడు కదా అని అడగ్గా.. అవును, ఇది సీక్రెట్. నా పర్సనల్స్ ఎప్పుడు నేను చెప్పలేదు. మీకెలా తెలిసింది? మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అని అస‌లు సీక్రెట్ రివీల్ చేసింది రుహాని. అనుష్క శర్మ నాకు సిస్టర్ అవుతుంది. విరాట్ కోహ్లీ బావ అవుతారు. విరాట్ చాలా మంచివాడు. నాతో బాగానే ఉంటాడు అందరితో చాలా మంచిగా ఉంటారు, ఎలాంటి ఫిల్టర్స్ లేకుండా సింపుల్ గా ఉంటారు.

అందుకే వారు అంటే నాకు బాగా ఇష్టం అని చెప్పుకొచ్చింది రుహానీ. మ‌రి అంత మంచి బ్యాక్‌గ్రౌంగ్ ఉన్న రుహాని ఎందుకు అంత‌గా ఇండ‌స్ట్రీలో రాణించ‌లేక‌పోతుంది అని చాలా మంది ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక రుహాని న‌టించిన సైంధ‌వ్ చిత్రం చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్‌ ఏరియా నేపథ్యంలో సాగుతుంది. ఈ మూవీని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి తెరకెక్కిస్తున్నారు. సైంధవ్‌కు సంతోష్‌ నారాయణన్‌ సంగీతం అందిస్తున్నాడు.