సాయిధరమ్ తేజ్ పరువు తీసిన నెటిజన్.. మెగా హీరో రియాక్షన్ ఏంటంటే..!

మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ వివాదాలకి చాలా దూరంగా ఉంటాడు. ఎప్పుడు కూడా ఏ విషయంలోను కాంట్రవర్సీలు క్రియేట్ చేయడు. అయితే కొద్ది రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో సాయిధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తేజూపై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే మెగా ఫ్యామిలీతో పాటు ఆయన సన్నిహితులు కూడా సాయిధరమ్ తేజ్‌పై వచ్చిన విమర్శలని ఖండించారు.. ‘పిల్లా.. నువ్వులేని జీవితం’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు సాయిధరమ్ తేజ్. 2014 నవంబర్ 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ సినిమాతో కెరీర్‌లో తొలి హిట్ కొట్టాడు. ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేస్తూ వచ్చాడు.
ఇటీవల సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే సాయిధరమ్ తేజ్ ఇండస్ట్రీలోకి వచ్చి 9 ఏండ్లు పూర్తి చేసుకుని 10వ వసంతంలోకి అడుగు పెట్టిన సందర్భంగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. #AskSDT పేరుతో అభిమానులతో మాట్లాడిన సాయిధరమ్ తేజ్‌ని నెటిజన్స్ పలు ప్రశ్నలు వేసారు. వారికి తేజ్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మీ పెళ్లి ఎప్పుడు బ్రో? అని ఓ నెటిజన్ అడగ్గా, నీ వివాహం అయిన వెంటనే సరదాగా చెప్పారు. ఇక పెద్దమామ చిరంజీవి సినిమా ఎప్పుడు చేయబోతున్నారు అని తేజ్‌ని ఓ నెటిజన్ అడగగా, దానికి సమాధానం ఇచ్చిన తేజూ ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు స్పష్టం చేశాడు.
ఇక రామ్ చరణ్ తో కథ సెట్ అయితే సినిమా చేస్తానని అన్నాడు. మరో నెటిజన్ అర్జెంట్ గా రూ. 10 లక్షలు కావాలని అడడగా, దానికి సమాధానంగా బ్రహ్మానందం నవ్వుతూ ఉండే జిఫ్ ఇమేజ్ రిప్లైగా ఇచ్చారు. ఇక రొటీన్ సినిమాలకు కాకుండా ‘విరూపాక్ష’ లాంటి సినిమాలు చేయాలని ఓ నెటిజన్ సలహా ఇవ్వగా అన్ని రకాల సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మరోనెటిజన్ సాయిధరమ్ తేజ్ ఇచ్చిన రిప్లైలో రిపబ్లిక్ పేరు ఇంగ్లీష్‌లో తప్పుగా రాసినందుకు విమర్శించాడు. రిలబ్లిక్ కాదురా రిపబ్లిక్… ఎప్పుడైనా స్కూల్ కి వెళ్లావా? అంటూ సెటైర్ వేయగా, దానిపై స్పందించిన తేజ్ నా స్కూల్లో నాకు గౌరవం కూడా నేర్పించారని, మీ స్కూల్లో నీకు నేర్పించారా? అని ప్రశ్నించాడు. నేర్పించకపోతే నేర్చుకో అని ఘాటుగా బదులివ్వగా , నన్ను క్షమించు అన్నా… నీవు రిప్లై ఇవ్వవనే అలా పెట్టాను అని అన్నాడు. మొత్తానికి సాయిధరమ్ తేజ్ మరోసారి అభిమానుల మనసులు గెలుచుకున్నాడు.