సలార్ మేకింగ్ వీడియో… థ్రిల్ ఫీలవుతున్న ఫ్యాన్స్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం సలార్. ఎన్నో అంచనాలతో ఈ మూవీ శుక్రవారమే విడుదలైంది. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని హోంబళే సంస్థ నిర్మించింది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్‌గా.. జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్లుగా చేశారు. ఇందులో శ్రీయా రెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహా, ఈశ్వరీ రావులు నటించారు. రవి బస్రూర్ సంగీతం అందించాడు.. ప్రస్తుతం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తుంది. 3 రోజుల్లో ‘సలార్: సీజ్‌ఫైర్’ తెలుగులో భారీ వసూళ్లు సాధించింది.
ఫలితంగా నైజాంలో రూ. 44.57 కోట్లు, సీడెడ్‌లో రూ. 12.65 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 9.77 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 7.31 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 4.72 కోట్లు, గుంటూరులో రూ. 6.80 కోట్లు, కృష్ణాలో రూ. 4.80 కోట్లు, నెల్లూరులో రూ. 3.30 కోట్లతో.. రూ. 93.92 కోట్లు షేర్, రూ. 140.30 కోట్లు గ్రాస్ వసూలు అయింది. ఈ మూవీ ఓవరాల్‌గా ప్రపంచ వ్యాప్తంగా 3 రోజుల్లో రూ. 185.67 కోట్ల షేర్ (రూ. 330.00 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది.తాజాగా చిత్ర మేకింగ్ వీడియో విడుదల చేశారు. ఇందులో సీక్వెన్స్ చిత్రీకరణని చూపించారు. భారీ సెట్స్, భారీ క్రూ మెంబెర్స్ తో సినిమాని రూపొందించగా, మేకింగ్ వీడియోలో కొన్ని విజువల్స్ చూసి ఆడియన్స్ థ్రిల్ ఫీల్ అవుతున్నారు.
చిత్రంలో మనం ఖాన్సార్ కోటని చూడగా, అందులో పెద్ద పెద్ద విగ్రహాలు కత్తులు పట్టుకొని నిలబడి కనిపిస్తాయి. ఇవి గ్రాఫిస్స్ లో చూపించారని అందుకున్నారు. కానీ ఇప్పుడు మేకింగ్ వీడియోలో అవి సెట్ ప్రోపర్టీగా కనిపించాయి. అలాగే హెలికాప్టర్స్, యుద్ధ వాహనాల్ని కూడా గ్రాఫిక్స్ కాకుండా ఒరిజినల్ గానే చూపించినట్టు మేకింగ్ వీడియోని బట్టి అర్ధమవుతుంది. చిత్ర బృందం సినిమా కోసం చాలా కష్టపడినట్టు మేకింగ్ వీడియోని బట్టి తెలుస్తుంది. ఇక ప్రతి మేకింగ్ షాట్ లో టెక్నీషియన్స్, యాక్టర్స్ తో కలుపుకొని దాదాపు 100కు పైగా మెంబెర్స్ సెట్ లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ మేకింగ్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.