ఎస్‌బీఐలో 80 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

ఎస్‌బీఐలో ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. 80 స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

ఎస్‌బీఐలో 80 స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలువ‌డింది. రెగ్యుల‌ర్ ప్ర‌తిపాదిక‌న 80 స్పెష‌లిస్ట్ కేడ‌ర్ ఆఫీస‌ర్ పోస్టుల భ‌ర్తీకి ముంబైలోని ఎస్‌బీఐ ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్య‌ర్థులు మార్చి 4వ తేదీ లోపు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని సూచించింది. ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల అభ్య‌ర్థుల‌కు ద‌ర‌ఖాస్తు ఫీజు మిన‌హాయింపు ఇచ్చింది.

పోస్టుల వివ‌రాలు..

అసిస్టెంట్ మేనేజ‌ర్‌(సెక్యూరిటీ అన‌లిస్ట్) – 23

డిప్యూటీ మేనేజ‌ర్(సెక్యూరిటీ అన‌లిస్ట్) – 51

మేనేజ‌ర్(సెక్యూరిటీ అన‌లిస్ట్)- 3

అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌(అప్లికేష‌న్ సెక్యూరిటీ)- 3

అర్హ‌త‌లు..

పోస్టును బ‌ట్టి సంబంధిత విభాగంలో బీఈ /బీటెక్, ఎంఈ/ ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీతో పాటు ప‌ని చేసిన అనుభ‌వం ఉండాలి. ఇక అసిస్టెంట్ మేనేజ‌ర్ పోస్టుకు 30 ఏండ్లు, డిప్యూటీ మేనేజ‌ర్‌కు 35 ఏండ్లు, మేనేజ‌ర్‌కు 38 ఏండ్లు, అసిస్టెంట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌కు 42 ఏండ్లు మించ‌రాదు. త‌దిత‌ర వివ‌రాల కోసం www.sbi.co.in అనే వెబ్‌సైట్‌ను సంద‌ర్శించొచ్చు.