ఇదేంటి.. జబర్ధస్త్ షోకి మళ్లీ యాంకర్ మారిందేంటి.. ఈ సారి ఎవరంటే..!

బుల్లితెర కామెడీ షో జబర్ధస్త్ గత కొన్నేళ్లుగా సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న విషయం తెలిసిందే. కమెడీయన్స్, యాంకర్స్, జడ్జెస్ మారుతున్నా కూడా ఈ షో మాత్రం అన్‌స్టాపబుల్‌గా సాగుతూనే ఉంది. ఈ షోతో పరిచయమైన చాలా మంది ఇప్పుడు లైఫ్‌లో సెటిల్ అయి మంచి స్థానాలలో ఉన్నారు. కొందరు హీరోలుగా.. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఫుల్ బిజీ బిజీగా ఉంటున్నారు. ఇక ఈ షోకి మొదటగా అనసూయ యాంకరింగ్ చేసింది. మధ్యలో కొన్ని సమస్యల వలన అనసూయ తప్పుకోవడంతో జబర్ధస్త్, ఎక్స్‌ట్రా జబర్ధస్త్ రెండింటిని రష్మీనే హోస్ట్ చేసింది.మళ్లీ కొన్నాళ్లకి అనసూయ రావడంతో అప్పుడు జబర్దస్త్ షోని ఆమె హోస్ట్ చేయగా, ఎక్స్‌ట్రా జబర్థస్త్‌ని రష్మీ హోస్ట్ చేసింది.
అయితే అనసూయకి ఇటీవల సినిమా ఆఫర్స్ ఎక్కువ రావడంతో ఆమె పూర్తిగా జబర్ధస్త్ షో నుండి తప్పుకుంది. దాంతో అనసూయ స్థానంలో సౌమ్యరావు అనే కన్నడ బ్యూటీని తీసుకొచ్చారు. ఈమెకి సీరియల్స్‌తో మంచి పాపులారిటీ రావడంతో జబర్ధస్త్ షోకి హోస్ట్‌గా ఎంపిక చేశారు. ఇప్పుడు ఆమెని తప్పించి బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంత్‌ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. కన్నడ భామ సౌమ్య రావు దాదాపు ఏడాదిన్నర నుంచి జబర్ధస్త్‌కి యాంకరింగ్ చేస్తుండగా, ఆమెకి మంచి మార్కులే పడుతున్నాయి. రేటింగ్ పరంగానూ బాగానే ఉండగా, సడెన్‌గా సిరి ఎందుకు వచ్చిందో అర్ధం కావడం లేదు. యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన సిరి బిగ్ బాస్ ఐదో సీజన్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. అందులో టాప్ 5లో నిలిచి ఆకట్టుకుంది.
హౌజ్‌లో ఉన్నప్పుడు సిరి.. షణ్ముఖ్‌తో కలిసి ఎంత రచ్చ చేసిందో మనం చూశాం. వారిద్దరిపై కొంత ట్రోల్ కూడా నడిచింది. అయితే సిరికి బిగ్ బాస్ బాగానే కలిసి వచ్చిందనే చెప్పాలి. హౌజ్ నుండి బయటకు వచ్చాక ఆమెకి చాలానే ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే జబర్ధస్త్ షో ఆఫర్ కూడా వచ్చిందని అంటున్నారు. తాజాగా జబర్ధస్త్ షోకి సంబంధించిన ప్రోమో విడుదల కాగా, కొత్త యాంకర్‌కి జడ్జ్ లు, కమెడియన్లు ఆహ్వానం పలికారు. ఆమెని హైలైట్ చేస్తూ షోని నడిపించినట్టు తెలుస్తుంది.. ప్రోమోలో సిరి హైలైట్ అవుతుంది. ఇక సిరిపై నూకరాజు ఆపుకోలేక పంచ్ వేశాడు. కొత్త యాంకర్ నెలరోజులే అంటూ కామెంట్ చేయడంతో ఆమె ముఖం వాడిపోయినంత పనైంది. మరి సిరి జబర్ధస్త్ షోతో టాప్ యాంకర్‌గా ఎదుగుతుందో లేదో చూడాలి. కాగా, సౌమ్య రావు ఎందుకు మానేసింది ? ఎప్పుడు మానేసింది ? అసలేం జరిగిందంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.