నేను తాగుతానంటూ చెప్పి అవ‌మానించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు అంటూ శృతి కామెంట్

  • By: sn    breaking    Dec 20, 2023 10:39 AM IST
నేను తాగుతానంటూ చెప్పి అవ‌మానించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు అంటూ శృతి కామెంట్

అందాల ముద్దుగుమ్మ‌, క‌మ‌ల్ గారాల ప‌ట్టి శృతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రంతో ఒక్క‌సారిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అక్క‌డి నుండి వెనుదిరిగి చూసుకోలేదు. మంచి అవ‌కాశాల‌ని అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది. రీసెంట్‌గా శృతి సినిమాల‌తో కన్నా త‌న బాయ్‌ఫ్రెండ్‌తో చేసే ర‌చ్చ‌కి సంబంధించిన వ్య‌వ‌హారంతో హైలైట్ అవుతుంది. అయితే తాజాగా శృతి ఓ ఇంట‌ర్వ్యూలో త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించి కొన్ని విష‌యాలు తెలియ‌జేస్తూ అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది. త‌న‌కు ఒక‌ప్పుడు మ‌ద్య‌పానం అల‌వాటు ఉండేది. కాని ఎనిమిదేళ్లుగా దానికి దూరంగా ఉన్నాను.

ప్ర‌స్తుతం జీరో రిగ్రెట్, జీరో హ్యాంగ్ ఓవర్స్‌తో హుందాగా ఉన్నాన‌ని పేర్కొంది శృతి. అయితే తాను ఎప్పుడు డ్రగ్స్ జోలికి వెళ్లలేదంటోంది. స్మోకింగ్ వరెస్ట్ అంటూ కామెంట్ చేసింది. పార్టీలకు వెళ్లడం వల్ల మద్యం తాగాల్సి వచ్చేదని.. ఈ అలవాటు తీవ్రమవుతుందని గమనించి అలాంటి ఫ్రెండ్స్‌కు కూడా దూరంగా ఉండ‌డం మొద‌లు పెట్టాను. ఇంకెప్పుడు కూడా తాగొద్ద‌ని డిసైడ్ అయ్యాను. దాంతో ఇప్పుడు నా లైఫ్ చాలా హ్యాపీగా ఉంద‌ని శృతి హాస‌న్ పేర్కొంది. అయితే తాను ఎంతో హుందాత‌నంగా ఉన్న‌ప్ప‌టికీ మద్యం అలవాటు గురించి చెప్పి.. తనను అవమానపరచడానికి ప్రయత్నించినా ఆ ప్రయత్నాలు ఫలించలేదని శృతి హాస‌న్ అంటుంది.

ప్ర‌స్తుతం ఆ దేవుడి ద‌య వ‌ల‌న నా జీవితం బాగుంద‌ని పేర్కొంది. త‌న‌కు ఎన్ని ప్ర‌తికూల‌త‌లు వ‌చ్చిన కూడా ఇబ్బంది లేద‌ని ఆమె పేర్కొంది. శృతి ల‌వ్‌లో కూడా ఫెయిల్ అయింది. మాజీ ప్రియుడితో పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్న స‌మ‌యంలో శృతి హాస‌న్ సినిమాలు చేయ‌డం కూడా మానేసింది. ఎప్పుడైతే అత‌నికి బ్రేక‌ప్ చెప్పిందో అప్ప‌టి నుండి తిరిగి సినిమాలు చేస్తుంది. శృతి ఇటీవల విడుదలైన హాయ్ నాన్న సినిమాలో ఓ ముఖ్య పాత్రలో కనిపించింది. అలాగే డిసెంబర్ 22న విడుదలవుతోన్న ప్రభాస్ సలార్ సినిమాతో ప‌ల‌క‌రించింది. ఇక అడివి శేష్‌తో క‌లిసి ఓ సినిమా చేస్తుంది. లవ్ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్ ప్రాజెక్ట్ కాగా.. షనియల్‌ డియో అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెర‌కెక్కించబోతున్నాడు.