ఈ ఒక్కవారం ఎలిమినేట్ చేయకండి నాగార్జునని వేడుకున్న రతిక.. కాని ఏమైందంటే..!

సండే ఫన్‌డే అంటూ ఆదివారం చాలా సందడిగా కార్యక్రమం సాగుతుంది. వెరైటీ గేమ్స్ ఆడుతూ, పాటలు పాడుతూ, డ్యాన్స్‌లు చేస్తూ తెగ సందడి చేస్తుంటారు. అయితే చివరలో మాత్రం ఎలిమినేషన్‌తో అందరితో గుండెలు గుబేల్‌మనేలా చేస్తారు.ఈ ఆదివారం టేస్టీ తేజ హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యాడు. సాధారణంగా ఎలిమినేట్ అయినప్పుడు చాలా ఏడ్చుకుంటూ హౌజ్‌ని వీడతారు. కాని తేజ మాత్రం చాలా నవ్వుకుంటూ బయటకి వచ్చాడు. తొమ్మిదో వారంలో రతికకి, తేజకి మధ్య జరిగిన ఉత్కంఠభరితమైన ఎలిమినేషన్ ప్రక్రియలో తేజ ఎలిమినేట్ అయినట్టు నాగ్ ప్రకటించాడు. తన జర్నీ చూసుకొని మురిసిపోయాడు. అంతా బాగానే ఉంది కాని అమ్మని తీసుకురాలేకపోయాననే ఒక్క బాధ మిగిలి ఉందని చెప్పుకొచ్చాడు.
షో మొదట్లో ఎస్‌జే సూర్య, లారెన్స్ బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు. తమ లేటెస్ట్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా సందడి చేశారు.అయితే మధ్య మధ్యలో ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగార్జున చివరలో రతిక, తేజని మాత్రమే ఉంచి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో వారి పేరు బోర్డ్ మీద కనిపిస్తుందని అన్నాడు. అయితే తాను ఎలిమినేట్ అవుతుందేమోనన్న భయంతో రతిక తెగ ఏడ్చింది. ఈ ఒక్క వారం ఉంచమని వేడుకుంది. అయితే అది తన చేతుల్లో కాని, బిగ్ బాస్ చేతుల్లో కూడా లేదని అన్నాడు. అయితే చివరకి రతిక సేవ్ అయి తేజ ఎలిమినేట్ అయ్యాడు. హౌజ్‌ని వీడే ముందు శివాజీతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. శోభా శెట్టి కూడా ఏడ్చేసింది.
అయితే వెళ్లే ముందు శోభా దగ్గరకి వెళ్లిన తేజా తెలిసో తెలియకో నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటాను. హర్ట్ అయి ఉంటే క్షమించు అని అన్నాడు. తేజ ఎలిమినేషన్‌తో షాక్ లో ఉన్న శోభా నా కెప్టెన్సీ చూసి పోరా అంటూ ఏడుపు మొదలుపెట్టింది. దీంతో బయటకు వెళ్లాక 24 గంటలు చూస్తాలేవే అంటూ హగ్ ఇచ్చి ఆ తర్వాత ఇంట్లో సభ్యులకు ఒక్కొక్కరికి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశాడు . హౌజ్‌లో ఇన్ని రోజులు ఉండేలా చేసిన బిగ్ బాస్‌కి, నాగార్జునకి, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తేజ. ఇక వెళ్లే ముందు హౌజ్ మేట్స్ గురించి చెబుతూ, వారిక ఆట తీరుకి తనదైన స్టైల్‌లో మార్కులిచ్చారు. తన ఫ్రెండ్ శోభా శెట్టికి 20 మార్కులివ్వగా, గౌతమ్ అతిగా ఆలోచిస్తాడని,అది తగ్గించుకోవాలి కాబట్టి 8 మార్కులిచ్చాడు. ఇక అర్జున్‌కి ఎనిమిది, యావర్‌కి పది, భోలేకి ఏడు, అశ్వినికి 8, ప్రశాంత్‌కి 9, ప్రియాంకకి 10, అమర్ దీప్ కి 9, రతికకి ఐదు, శివాజీకి ఎనిమిది మార్కులిచ్చి బిగ్ బాస్ హౌజ్‌ని వీడాడు టేస్టీ తేజ.