TTD | 28న తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం మూసివేత‌

TTD | 28న తిరుమ‌ల శ్రీవారి ఆల‌యం మూసివేత‌

TTD | ఈ నెల 28న తిరుమ‌ల శ్రీవారి ఆల‌యాన్ని మూసివేయ‌నున్నారు. పాక్షిక చంద్ర‌గ్ర‌హ‌ణం కార‌ణంగా శ్రీవారి ఆల‌యాన్ని మూసివేస్తున్న‌ట్లు టీటీడీ అధికారులు ప్ర‌క‌టించారు. సుమారు 8 గంట‌ల పాటు ఆల‌యం త‌లుపులు మూసి ఉంచ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.

29న తెల్ల‌వారుజామున 1:05 గంట‌ల నుంచి 2:22 గంట‌ల మ‌ధ్య పాక్షిక చంద్ర‌గ్ర‌హణం ఏర్ప‌డ‌నుంది. దీంతో గ్ర‌హ‌ణ స‌మ‌యానికి 6 గంట‌ల ముందు ఆల‌యం తలుపులు మూసి వేయ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ నేప‌థ్యంలో 28న రాత్రి 7:05 గంట‌ల‌కు ఆల‌య త‌లుపులు మూసివేయ‌నున్నారు. కావున భ‌క్తులు గ‌మ‌నించాల‌ని టీటీడీ అధికారులు సూచించారు.