ఈ ఏడాది టాలీవుడ్‌ని షేక్ చేసిన అతి పెద్ద వివాదాలు ఏంటంటే..!

మరి కొద్ది రోజులలో 2023 ముగియనుంది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా పాత జ్ఞాపకాలు నెమరవేసుకుంటున్నారు.సినిమా పరిశ్రమలో అనేక సంఘటనలు చోటు చేసుకోగా, కొన్ని వివాదాలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. అవేంటని చూస్తే కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రెస్‌గా ఉండే బాలయ్య.. వీరసింహారెడ్డి సక్సెస్ మీట్లో బాలకృష్ణ ఒకప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ అక్కినేని తొక్కినేని అన్నారు. దీనిపై నాగ చైతన్య, అఖిల్ సైతం సున్నితంగా సోషల్ మీడియా ద్వారా ఖండించారు. చివరికి బాలయ్య క్లారిటీ ఇచ్చి వివాదానికి ముగింప పలికాడు. ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు సమయంలో దిల్ రాజు చిన్మ నిర్మాతలని ఎదగనీయడం లేదంటూ సి. కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇక సమంత మయోసైటిస్ వ్యాధిన పడగా, ఆమె ఆరోగ్యంపై నిర్మాత చిట్టిబాబు మాట్లాడుతూ.. ఆమె ప్రతి సినిమా విడుదలకు ముందు సింపతీ కోసం అనారోగ్యం తెరపైకి తెస్తుంది అని అన్నాడు. దానికి సమంత స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇక అనసూయ భరద్వాజ్-విజయ్ దేవరకొండల వివాదం కూడా టాలీవుడ్ ని షేక్ చేసింది. ఖుషి చిత్ర పోస్టర్ పై ‘ది విజయ్ దేవరకొండ’ అని రాయడంపై ఆమె పరోక్షంగా కామెంట్ చేయడంతో విజయ్ ఫ్యాన్స్ ఆమెని ఓ ఆట ఆడుకున్నారు. దాంతో తానే ఈ వివాదానికి పులిస్టాప్ పెడుతున్నట్టు ప్రకటించింది అనసూయ. ఇక బలగం సినిమాని వేణు కాపీ చేశాడని జర్నలిస్ట్ గడ్డం సతీష్ ఆరోపణలు చేశాడు. కాని దానిని వేణు ఖండిస్తూ సొంత అనుభవాలతో రాసుకున్న కథ అని వివరణ ఇచ్చారు.
ఇక బ్రో చిత్రం కూడా అనేక వివాదాలకి దారి తీసింది. చిత్రంలో ఏపీ మంత్రి అంబటి రాంబాబును గుర్తు చేస్తూ స్పూఫ్ సాంగ్ రూపొందించారు. దీనిపై యూనిట్ క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.ఇక మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ మధ్య గొడవలు తారా స్థాయికి చేరాయి. విష్ణు నా మనుషుల మీద దాడి చేస్తున్నాడని మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేయగా, ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. వారు ఏ విషయంలో గొడవ పడ్డారని ఇంత వరకు క్లారిటీ రాలేదు. ఇక చంద్రబాబు నాయుడు అరెస్ట్ పై జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదని, దానిపై మీరేమంటారు అని బాలయ్యని మీడియా ప్రశ్నించగా, దానికి ఆయన ఐ డోంట్ కేర్ అన్నాడు. ఇలా అనేక వివాదాలు ఇండస్ట్రీని చుట్టుముట్టగా, అవి నెట్టింట తెగ హాట్ టాపిక్ అయ్యాయి.