TSRTC | విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక జేబీఎస్ నుంచి కూడా బ‌స్సులు

TSRTC | విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు గుడ్‌న్యూస్‌.. ఇక జేబీఎస్ నుంచి కూడా బ‌స్సులు

TSRTC | హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికుల‌కు టీఎస్ఆర్టీసీ శుభ‌వార్త వినిపించింది. ప్ర‌యాణికుల విజ్ఞ‌ప్తుల మేర‌కు జేబీఎస్ నుంచి విజ‌య‌వాడ‌కు బ‌స్సులు న‌డ‌పాల‌ని టీఎస్ ఆర్టీసీ నిర్ణ‌యించింది. దీంతో జేబీఎస్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉంటున్న విజ‌య‌వాడ వాసులు.. ఇక నుంచి ఎంజీబీఎస్ వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది.

బీహెచ్ఈఎల్, మియాపూర్ నుంచి బ‌యల్దేరే 24 స‌ర్వీసుల‌ను ఎంజీబీఎస్ నుంచి కాకుండా జేబీఎస్ మీదుగా న‌డ‌ప‌నున్న‌ట్లు ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు. ఈ స‌ర్వీసులు కేపీహెచ్‌బీ కాల‌నీ, బాలాన‌గ‌ర్‌, బోయిన్‌ప‌ల్లి, జేబీఎస్, సంగీత్‌(పుష్ప‌క్ పాయింట్), తార్నాక‌(పుష్ప‌క్ పాయింట్), హ‌బ్సిగూడ‌(పుష్ప‌క్ పాయింట్), ఉప్ప‌ల్(పుష్ప‌క్ పాయింట్), ఎల్‌బీ న‌గ‌ర్ మీదుగా విజ‌య‌వాడ‌కు బ‌య‌ల్దేర‌నున్నాయి.

జేబీఎస్ నుంచి విజ‌య‌వాడ వెళ్లే స‌ర్వీసులు అక్టోబ‌ర్ 18 నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ బ‌స్సుల్లో టికెట్ ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఎంజీబీఎస్ నుంచి న‌డిచే స‌ర్వీసుల‌కు ఉన్న ఛార్జీలే ఈ బ‌స్సుల‌కు ఉంటాయ‌న్నారు. జేబీఎస్ నుంచి బ‌య‌ల్దేరే బ‌స్సుల్లో ముందస్తు రిజ‌ర్వేష‌న్ కోసం tsrtconline.in అనే వెబ్‌సైట్‌ను సంప్ర‌దించొచ్చు.