పెళ్లి దుస్తుల‌లో వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి..అట్ట‌హాసంగా జరిగిన వివాహ వేడుక‌

పెళ్లి దుస్తుల‌లో వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి..అట్ట‌హాసంగా జరిగిన వివాహ వేడుక‌

నిహారిక విడాకుల ప్ర‌క‌ట‌న త‌ర్వాత వ‌రుణ్ తేజ్- లావ‌ణ్య త్రిపాఠి ఇట‌లీ వేదిక‌గా పెళ్లి చేసుకోవ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఎప్పుడో వారి వివాహం జ‌ర‌గాల్సి ఉన్నా కూడా నిహారిక విడాకులు ప్ర‌క‌టించిన వెంట‌నే పెళ్లి చేసుకోవ‌డం బాగుండ‌ద‌ని కొద్ది రోజుల పాటు వెయిట్ చేశారు. ఎట్ట‌కేల‌కు న‌వంబ‌ర్ 1 సాయంత్రం ఏడు గంటల 18 నిమిషాలకు వీరి వివాహం జరిగింది. చాలా లావిష్‌ మ్యానర్‌లో, గ్రాండియర్‌గా వరుణ్‌లవ్‌ పెళ్లి వేడుక జరగ‌గా, ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. వేద‌ మంత్రాల సాక్షిగా బుధవారం రాత్రి(నవంబర్ 1) ఇటలీలోని టస్కనీలో వీరి వివాహం అంగరంగ వైభవంగా జ‌రగ‌గా, ఈ వేడుక‌కు ఇరు కుటుంబాలు, బంధుమిత్రులు స‌హా టాలీవుడ్ సెల‌బ్రిటీలు సైతం హాజ‌ర‌య్యారు.

వరుణ్ లవ్ పెళ్లిలో రామ్‌ చ‌ర‌ణ్‌, అల్లు అర్జున్‌, నితిన్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా నిలిచారు. మొత్తంగా మెగా ప్రిన్స్ తో మూడు ముళ్లు వేయించుకుని లావ‌ణ్య త్రిపాఠి అధికారికంగా మెగా కోడలు అయ్యింది . పెళ్లి ఇటలీలో జరిగినా, మ‌న ట్రెడిష‌న్‌ని వారు ఫాలో అయ్యారు. పెళ్లి తంతు ముగిశాక ఇద్దరూ దేవుడికి నమస్కరిస్తుండా, అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అయింది. ఇక పెళ్లికి ముందు వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠిల‌ని ల‌గ్జ‌రీ కారులో వేదిక వ‌ద్ద‌కి తీసుకు వ‌చ్చారు. అనంత‌రం వేదిక వ‌ద్ద డ్యాన్సుల‌తో హోరెత్తించారు. ఈ పెళ్లి వేడుక చూసి నాగ‌బాబు ఆయ‌న స‌తీమ‌ణి చాలా సంతోషం వ్య‌క్తం చేశారు. ఇక ఈ వేడుక‌లో ప‌వ‌న్ కూడా సంద‌డి చేశారు.

వ‌రుణ్ తేజ్ లావ‌ణ్య త్రిపాఠి పెళ్లికి మొత్తంగా 120 మంది గెస్ట్‌ల‌ని మాత్ర‌మే ఆహ్వానించారు. వారిలో చిరంజీవి, సురేఖ, పవన్‌ కళ్యాణ్‌, ఆయన భార్య, రామ్‌చరణ్‌, ఉపాసన, అల్లు అర్జున్‌, స్నేహారెడ్డి, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌, అల్లు అరవింద్ త‌దిత‌రులు ఉన్నారు. మూడు రోజులపాటు వరుణ్‌లవ్‌ మ్యారేజ్‌ వేడుక నిర్వహించ‌గా, అక్టోబర్‌ 30 కాక్‌టెయిల్‌ పార్టీ, 31న హల్దీ, మెహందీ వేడుక నిర్వహించారు. ఇక నవంబ‌ర్ 1న పెళ్లి వేడుక నిర్వ‌హించారు. ఇట‌లీలో ఈ జంట ప్రేమ‌లో ప‌డిన నేప‌థ్యంలో అక్క‌డే పెళ్లి కూడా చేసుకోవాల‌ని భావించి ఏడ‌డుగులు వేశారు. అత్యద్భుతమైన గ్రీనరీకి నెలవుగా నిలిచే ట‌స్కానీలో వ‌రుణ్ తేజ్, లావ‌ణ్య త్రిపాఠి పెళ్లి జ‌ర‌గ‌డం విశేషం. 3వ తేదీన వారు హైద‌రాబాద్‌కి తిరిగి రానుండ‌గా, 5న రిసెప్ష‌న్ జ‌ర‌గ‌నుంది.