నిర్మాతలతో వివాదం… తగ్గే కొద్ది మింగుతారంటూ విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వివాదాలతో నిలుస్తూ వస్తున్నారు. ఆ మధ్య టీవీ9 యాంకర్‌తో వివాహం, అనంతరం అర్జున్‌తో వివాదం ఆయన పేరు వార్తలలో నిలిచేలా చేసింది. అయితే తాజాగా నిర్మాతలతో ఆయనకి వివాదం ఏర్పడినట్టు తెలుస్తుండగా, విశ్వక్ సేన్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. విశ్వక్ సేన్ ప్రస్తుతం తన 11వ సినిమా ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రాన్ని కృష్ణ చైతన్య దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. గోదావరి జిల్లాల నేపథ్యంతో సాగే ఈ సినిమా ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుందని తెలుస్తుంది.ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తి చేసుకొని డిసెంబర్‌లో రిలీజ్‌కి సిద్ధంగా ఉంది.
డిసెంబర్ 8న విడుదల చేస్తామని మేకర్లు ఎప్పుడో ప్రకటిం,ఇన కూడా ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో ఏదో తేడా కొడుతూనే ఉంది. ఈ క్రమంలో విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశాడు. బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ప్రతీ నా కొడుకు మన గేమ్ మారుద్దాం అనుకుంటాడు.. నేను సినిమా చూడకుండా ప్రతీ ఫ్రేమ్ ప్రాణం పెట్టి పని చేసి చెబుతున్నా.. డిసెంబర్ 8న వస్తున్నాం.. హిట్, ఫ్లాప్, సూపర్ హిట్, అట్టర్ ఫ్లాప్ చేస్తారన్నది మీ ఇష్టం.. అది మీ నిర్ణయం.. ఆవేశానికి లేదా ఈగోకి తీసుకునే నిర్ణయం కాదు.. తగ్గే కొద్దీ మింగుతారు అని అర్థమైంది.. డిసెంబర్ 8న శివాలెత్తిపోద్ది.. గంగమ్మ తల్లి కి నా ఒట్టు.. మహా కాళి మాతో ఉంది.. డిసెంబర్‌లో సినిమా రాకపోతే.. నేను ప్రమోషన్స్‌లో కనిపించను.. రాను.. అని విశ్వక్ సేన్ కోపోద్రిక్తుడయ్యాడు.
డిసెంబర్ 7, 8 తేదీల్లో ఎక్కువ సినిమాల రిలీజ్ అవుతున్నాయి. నితిన్ ఎక్స్‌ట్రార్డినరీ, వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ వంటి సినిమాలు వస్తున్న నేపథ్యంలో విశ్వక్ సేన్ సినిమాను పోస్ట్ పోన్ చేయాలని నిర్మాతలు భావించారని, ఆ మేరకు ఒత్తిడి తెచ్చారని ప్రచారం జరుగుతుండగా, తాను ఇలా స్పందించాడని అనుకుంటున్నారు. సినిమా పోస్ట్ పోన్ చేస్తే మాత్రం తాను ఇక ప్రమోషన్స్‌కు రాను అని ఇన్‌డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చాడని అనుకుంటున్నారు. మరి చిత్ర నిర్మాతలు దీనిపై ఎలా రెస్పాండ్ అవుతాడనేది ఆసక్తికరంగా మారింది.