నాకు ఆ వ్యాధి ఉంది.. అందుకే ఇంత లావు అయ్యాను..వైవా హ‌ర్ష షాకింగ్ కామెంట్స్

నాకు ఆ వ్యాధి ఉంది.. అందుకే ఇంత లావు అయ్యాను..వైవా హ‌ర్ష షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ ప్ర‌ముఖ క‌మెడీయ‌న్స్‌లో వైవా హ‌ర్ష ఒకరు. ఆయ‌న గ‌తంలో త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి చేసిన వీడియోతో ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చాడు.ఇక అప్ప‌టి నుండి మ‌నోడిని సినిమా అవ‌కాశాలు ప‌ల‌క‌రించ‌డం, టాప్ క‌మెడీయ‌న్‌గా మంచి గుర్తింపు తెచ్చుకోవ‌డం జ‌రిగింది. అడ‌పాద‌డ‌పా వైవా హ‌ర్ష స్టార్ హీరోల‌ సినిమాలలో కూడా క‌నిపిస్తూ సంద‌డి చేస్తుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే వైవా హర్ష తొలిసారి మెయిన్ లీడ్‌లో నటిస్తున్న చిత్రం సుందరం మాస్టర్. ఫిబ్రవరి 23న ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతున్న నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ కార్యక్ర‌మాల‌లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటున్నారు.

కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంని రవితేజ RT టీం వర్క్స్, గోల్డెన్ మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. ఇప్ప‌టికే విడుద‌లైన‌ ఈ సినిమా పోస్టర్, టీజర్‌తో పాటు రీసెంట్‌గా మెగాస్టార్ రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై భారీ అంచ‌నాలే పెంచింది. తాజాగా హ‌ర్ష ఓ ఇంట‌ర్వ్యూలో తన శరీరాకృతిపై, బాడీ షేమింగ్ గురించి వివ‌రిస్తూ చాలా ఎమోష‌న‌ల్ అయ్యాడు. స్కూల్ స్టేజ్ నుండే త‌న‌పై బాడీ షేమింగ్ కామెంట్స్ చేసే వార‌ని తెలియ‌జేశాడు. ట్రైన్‌లో ప్ర‌యాణించాల‌న్నా కూడా త‌నకి భ‌యం వేసేద‌ని, నా కలర్, బరువు గురించి పరోక్షంగా కామెంట్స్ చేసినప్పుడు చాలా కుమిలిపోయేవాడిని అని హ‌ర్ష తెలియ‌జేశారు.

చిన్న‌ప్పుడు ఆస్త‌మా ఉండ‌డం వ‌ల‌న అది త‌గ్గ‌డం కోసం స్టెరాయిడ్స్ వాడాల్సి వ‌చ్చింది. అందుకే ఇంత బ‌రువు పెరిగిన‌ట్టు హర్ష స్ప‌ష్టం చేశాడు. షూటింగ్ సమయంలో నా కలర్, బాడీ పై జోకులు వేసుకొని న‌వ్వుకునేవారు. డబ్బు కోసం ఈ అవమానాలు తప్పవు అని చాలా భ‌రించాన‌ని, అయితే వ్య‌క్తిగ‌తంగా ఎవ‌రు ఎలాంటి కామెంట్ చేయ‌లేద‌ని హ‌ర్ష తెలియ‌జేస్తూ భావోద్వేగానికి గుర‌య్యాడు. ఎవరైనా తనని లావుగా ఉన్నాడని వెక్కిరిస్తున్నప్పుడు తన పేరెంట్స్ పడే బాధని చూసి నాకు చాలా ఇబ్బంది అనిపించేది. ఇంటికి ఎవ‌రైన వ‌స్తే తాను ఇంట్లో ఉన్న‌ప్ప‌టికీ లేన‌ని చెప్పించేవాడిని. ఇంజ‌నీరింగ్‌కి వ‌చ్చాక చాలా యాక్టివ్ అయిన నేను ఆ త‌ర్వాత నా జీవితాన్ని ఎలా మ‌ల‌చుకోవాలో అర్ధం చేసుకున్నాను అంటూ హ‌ర్ష ఎమోష‌న‌ల్ కామెంట్స్ చేశారు