Heroine: ఇటీవల చాలా మంది హీరోయిన్స్ తాము పడ్డ ఇబ్బందుల గురించి నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పేస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ వలన తాము ఇబ్బంది పడిన, బాడీ షేమింగ్ వలన అవమానాలు ఎదురైన వారు ధైర్యంగా చెప్పేస్తున్నారు. తాజాగా రజనీకాంత్ హీరోయిన్ హ్యుమా ఖురేషి బాడీ షేమింగ్‌తో నన్ను కిందకు లాగాలని చూశారని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి కామెంట్ బీటౌన్‌లో కలకలం రేపుతున్నాయి. హ్యుమా ఖురేషి అంటే రజనీకాంత్ `కాలా` చిత్రం గుర్తుకు […]
Heroine: ఇటీవల చాలా మంది హీరోయిన్స్ తాము పడ్డ ఇబ్బందుల గురించి నిర్మొహమాటంగా మీడియా ముందు చెప్పేస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ వలన తాము ఇబ్బంది పడిన, బాడీ షేమింగ్ వలన అవమానాలు ఎదురైన వారు ధైర్యంగా చెప్పేస్తున్నారు. తాజాగా రజనీకాంత్ హీరోయిన్ హ్యుమా ఖురేషి బాడీ షేమింగ్‌తో నన్ను కిందకు లాగాలని చూశారని షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ అమ్మడి కామెంట్ బీటౌన్‌లో కలకలం రేపుతున్నాయి. హ్యుమా ఖురేషి అంటే రజనీకాంత్ ‘కాలా’ చిత్రం గుర్తుకు వస్తుంది. ఇందులో తన గ్లామర్ టచ్ ఇచ్చి అలరించింది. ఇక అజిత్ ‘వాలిమై’ లోనూ మెరిసింది. ఇందులో తన భారీ అందాలతో రక్తికట్టించే ప్రయత్నం చేసింది
బాలీవుడ్లో ‘డీ డే’, ‘బద్లాపూర్’, ‘హైవే’, ‘జాలీ ఎల్ఎల్బీ 2’, ‘దొబారా’, ‘బెల్ బాటమ్’, ‘డబుల్ ఎక్స్ ఎల్’, ‘మోనికా’, ‘టార్లా’ వంటి చిత్రాలు చేసి అలరించింది హ్యూమా ఖురేషి. అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో బాడీ షేమింగ్ ఎదుర్కొన్నట్టు తెలిపి అందరిని ఆశ్చర్యపరచింది. కొందరు తన బరువుపై కామెంట్ చేశారని, బాడీ షేమింగ్ కామెంట్లని కూడా తాను ఎదుర్కొన్నట్టు చెప్పింది హ్యూమా ఖురేషి. ఓ రివ్యూయర్.. తన నటన గురించి కాకుండా తన బాడీ గురించి కామెంట్ చేశారని, అది తనని చాలా బాధించిందని ఆమె పేర్కొంది.
ఎవరికైన సినిమా నచ్చకపోతే, లేదంటే నటన నచ్చకపోతే ప్రాబ్లమ్ కానీ, కొందరు వ్యక్తిగతంగా ట్రోల్స్ చేస్తున్నారని, అది చాలా బాధ కలిగిస్తుంటుంది హ్యూమా. ఇలాంటివి తనకు చాలా సార్లు ఎదురయ్యాయని, ఓ రివ్యూయర్ .. నన్ను టార్గెట్ చేసి మరీ రాయడం, నన్ను కిందకు లాగేలా ఆ రివ్యూ ఉండటం ఆశ్చర్యపరిచింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో చూశానని ఆవేదన వ్యక్తం చేసింది హ్యూమా ఖురేషి. ప్రస్తుతం ఈ అమ్మడి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా, హ్యుమా ‘గ్యాంగ్స్ ఆఫ్ వస్సేపూర్’ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొన్ని సినిమాలలో బోల్డ్ రోల్స్ కూడా చేసింది హ్యూమా. ఇటీవల ఆమె 37ఏళ్లు పూర్తి చేసుకోగా, ప్రస్తుతం బాలీవుడ్లో అటు సినిమాలతోపాటు ఇటు ఓటీటీ ఫిల్మ్స్, వెబ్‌సిరీస్‌లు కూడా చేస్తుంది.