Kavya Kalyan Ram | బాడీ షేమింగ్.. నేనలా ఎక్కడా అనలేదు బాబోయ్: కావ్య కళ్యాణ్ రామ్
Kavya Kalyan Ram | ఎవర్రా.. మా పొట్టిపిల్ల అంత మాట అన్నదని చెప్పింది.. అమ్మా! ఒకప్పటి సినిమాలలో శరీర ఆకృతి కన్నా నటనకు ప్రాముఖ్యత ఇస్తే., ఇప్పటి సినిమాకి నటనకన్నా కూడా శరీరం ఎంత బక్కపలచగా అంటే అంత క్లాసీ లుక్ ఉన్నట్టు లెక్కగా భావిస్తున్నారు. బొద్దుగా ఉంటే సినిమాల్లో హీరోయిన్‌గా పనికిరాదని తీసిపారేస్తున్నారు. అయితే హీరోయిన్ కాస్త ఒళ్ళు చేసినా అవకాశాలు తగ్గి పోవడమే కాదు, ఆమె శరీర ఆకృతి మీద సినీ పరిశ్రమలో […]
Kavya Kalyan Ram | ఎవర్రా.. మా పొట్టిపిల్ల అంత మాట అన్నదని చెప్పింది.. అమ్మా!
ఒకప్పటి సినిమాలలో శరీర ఆకృతి కన్నా నటనకు ప్రాముఖ్యత ఇస్తే., ఇప్పటి సినిమాకి నటనకన్నా కూడా శరీరం ఎంత బక్కపలచగా అంటే అంత క్లాసీ లుక్ ఉన్నట్టు లెక్కగా భావిస్తున్నారు. బొద్దుగా ఉంటే సినిమాల్లో హీరోయిన్‌గా పనికిరాదని తీసిపారేస్తున్నారు. అయితే హీరోయిన్ కాస్త ఒళ్ళు చేసినా అవకాశాలు తగ్గి పోవడమే కాదు, ఆమె శరీర ఆకృతి మీద సినీ పరిశ్రమలో చాలా విమర్శలే వినిపిస్తాయి. అలాంటి చేదు అనుభవాన్నే ఎదుర్కొన్నానని ‘బలగం’ ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా వార్తలు వైరల్ అయ్యాయి.
‘బలగం’ సినిమాలో పొట్టి పిల్లా పొట్టి పిల్లా.. నువ్వే నాకు దిక్కుమల్లా.. అంటూ ప్రియదర్శి ప్రేమగా పాడుకున్న విషయం తెలిసిందే. అలాంటిది తనపై కొందరు దర్శకులు బాడీ షేమింగ్‌కి పాల్పడ్డారని ఆమె చెప్పినట్లుగా.. వార్తలు క్రియేట్ చేశారు. ఈ వార్తలపై తాజాగా ఆమె క్లారిటీ కూడా ఇచ్చేసింది. నేనలా ఎక్కడా అనలేదు బాబోయ్ అంటూ సోషల్ మీడియా వేదికగా రియాక్టైంది.
ఒకప్పుడు బాలనటిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కావ్య కళ్యాణ్ రామ్.. ఈ మధ్య కాలంలో హీరోయిన్‌గా మూవీల్లోకి ఎంటరైంది. మొదటిగా హరర్ థ్రిల్లర్ మూవీ ‘మసూద’తో పరిచయం అయినా.. ఆ సినిమాలో పెద్దగా నటనకు ఛాన్స్ ఉండకపోవడంతో కావ్య నటన గురించి పెద్దగా తెలీలేదు. కానీ రెండో చిత్రం ‘బలగం’ సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. ‘బలగం’ కావ్య అనగానే టక్కున గుర్తు తెచ్చుకునేంతలా ప్రేక్షకులకు దగ్గరైంది.
‘బలగం’ సినిమా తెలంగాణ నేపథ్యంతో వచ్చినా.. తెలంగాణ వాళ్ళకే కాదు, అందరి మనసులకూ దగ్గరై భారీ కమర్షియల్ హిట్ కొట్టింది. బోలెడు అవార్డులను సైతం తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాలో నటించిన నటులందరికీ మంచి గుర్తింపే దక్కింది. అయితే రెండు సినిమాలతో మంచి హిట్ అందుకున్న కావ్య ఇప్పుడు చేస్తున్న ‘ఉస్తాద్’ ప్రమోషన్స్‌లో తన సినిమా అనుభవాలను చెబుతూ, హీరోయిన్‌గా అవకాశాల కోసం చూస్తున్న రోజుల్లో చాలా మంది దర్శక, నిర్మాతలు తన గురించి ‘బాడీ షేమింగ్’ చేశారని చెప్పినట్లుగా వార్తలు ఒక్కసారిగా గుప్పుమన్నాయి.
బొద్దుగా ఉన్నావని, ఇలా ఉంటే ఆఫర్స్ రావడం కష్టమని, ఇంకా ప్రత్యేకంగా బాడీ పార్ట్స్‌పై కామెంట్స్ చేసే వారని చెబుతూ కావ్య ఆవేదనకు లోనైందనేలా వార్తలు అల్లారు. అయితే.. అలా నేను ఎక్కడా అనలేదు. దయచేసి ఆ వార్తలు నిజం కావు. మీడియా వారు.. ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని కోరుతున్నానంటూ కావ్య కళ్యాణ్ రామ్ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసింది.
దీంతో ఆమెపై వస్తున్న వార్తలకు ఫుల్‌స్టాప్ పెట్టినట్లయింది. అయినా.. కెరీర్ కాస్త గాడిలో పడుతున్న సమయంలో.. ఎవరైనా అలా చెబుతారా? గతంలో ఎప్పుడో చెప్పిన వాటిని.. కావాలని కొందరు తోడుతున్నారేమో.. అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు నెటిజన్లు.
X


Google News
Facebook
Instagram
Youtube
Telegram