రాజ‌మౌళి సినిమాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టి కూడా ఫ్లాప్ కాక‌పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా?

  • By: sn    breaking    Feb 19, 2024 11:09 AM IST
రాజ‌మౌళి సినిమాలు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టి కూడా ఫ్లాప్ కాక‌పోవ‌డానికి కార‌ణం ఏంటో తెలుసా?

రాజ‌మౌళి.. ఈ పేరు దేశ వ్యాప్తంగానే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగాను ఫుల్ ఫేమ‌స్. బాహుబ‌లి సినిమాతో తెలుగోడి ఖ్యాతిని ఖండాంత‌రాలు దాటించేలా చేసిన రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయ‌న స‌త్తా ఏంటో మ‌రోమారు చూపించి హాలీవుడ్ ప్ర‌ముఖుల‌తో ప్ర‌శంస‌లు కూడా అందుకున్నాడు. ఆయ‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌టంటే ఒక్క ఫ్లాప్ కూడా లేదు. ఓట‌మెరుగ‌ని విక్ర‌మార్కుడిగా పేరు తెచ్చుకున్న రాజ‌మౌళి ఆయ‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క ఫ్లాప్ కూడా చ‌విచూడ‌లేదు.తొలి సినిమా నుండి ఆర్ఆర్ఆర్ సినిమా వ‌ర‌కు రాజ‌మౌళి ప్ర‌తి సినిమా కూడా సూపర్ డూప‌ర్ హిట్టే.

అయితే రాజమౌళి ఇలా వరుస సక్సెస్ లు కొట్టడం వెనక ఉన్న‌ విజయ రహస్యం తెలుసుకోవాలని చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్క‌డ సీక్రెట్ అంటూ ఏమి లేదు కాని ఆయ‌నకి ఫెయిల్యూర్స్ అంటే చాలా భ‌యం.ఓట‌మిని త‌ట్టుకొని నిల‌బ‌డే స‌త్తా రాజ‌మౌళికి పెద్ద‌గా లేదు. ఫెయిల్యూర్ ఎక్కడ వస్తే ఎక్క‌డ టెన్ష‌న్ ప‌డాల్సి వ‌స్తుందో అని ఓట‌మికి భయపడి చాలా వరకు కష్టపడి పనిచేసి త‌న‌ సినిమాలను విజయ తీరాలకు చేర్చుతుంటాడు జ‌క్క‌న్న‌. ఆయ‌న ప్ర‌తి సినిమా కోసం ఎంత ఎఫ‌ర్ట్ పెడ‌తారో మ‌నం చూస్తూనే ఉన్నాం. రోజులో 20 గంట‌ల పాటు వ‌ర్క్‌పైనే ఫోక‌స్ పెడుతుంటాడు. సినీ ప్రియుల‌కి ఎలాంటి స్ట‌ఫ్ కావాల‌నేది రాజ‌మౌళికి తెలిసినంత మ‌రెవ‌రికి తెలియ‌దంటే అతిశ‌యోక్తి కాదు.

బాహుబ‌లి, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ సినిమాల విష‌యంలో రాజ‌మౌళి ప్ర‌తిభ చూసి ప్ర‌తి ఒక్క‌రు ముక్కున వేలేసుకున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు సినిమాకి ఆస్కార్ తెచ్చిపెట్టిన ఘ‌న‌త కూడా రాజ‌మౌళిదే అని చెప్పాలి.ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబుతో పాన్ వ‌ర‌ల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఆయ‌న ఖ్యాతితో పాటు తెలుగు సినిమా పేరు ప్ర‌తిష్ట‌లు కూడా మ‌రింత పెరుగుతాయ‌ని ప్ర‌తి ఒక్క‌రు విశ్వ‌సిస్తున్నారు. ప్రభాస్, రామ్ చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్‌ల‌కి మంచి పేరు తీసుకొచ్చిన జ‌క్క‌న్న ఇప్పుడు మ‌హేష్ పేరు కూడా దేశ వ్యాప్తంగా చేస్తాడ‌నడంలో ఎలాంటి సందేహం లేదు . ఇక రాజ‌మౌళి లాంటి ద‌ర్శ‌కుడు మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలో ఉన్నాడు అంటే నిజంగా తెలుగు వాళ్ళం అయిన మనందరం గర్వపడాలనే చెప్పాలి…