Annapoorani | ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ‘అన్నపూరణి’ సినిమా చూడొచ్చు..!

నెట్ ఫ్లిక్స్ నుంచి అన్నపూరణి సినిమాను తీసేసినా.. మరో ఓటీటీ ప్లాట్ ఫాంలో ఈ సినిమా అందుబాటులో ఉన్నది.

Annapoorani | ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ‘అన్నపూరణి’ సినిమా చూడొచ్చు..!

 Annapoorani | సౌత్‌ లేడి సూపర్‌స్టార్‌ నయనతార నటించిన ‘అన్నపూరణి’ చిత్రం వివాదాల్లో చిక్కుకున్నది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చిత్రం ఉందని పలు సంస్థలు ఆరోపించాయి. ఇప్పటికే నటీనటులు, దర్శకుడు, చిత్ర నిర్మాతలపై కేసులు సైతం నమోదయ్యాయి. పలుచోట్ల చిత్ర నిర్మాణతకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు సైతం చేపట్టారు. చిత్రం వివాదాల్లో చిక్కుకోవడంతో నిర్మాతలు విచారం వ్యక్తం చేశారు. సినిమాలో మార్పులు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ నెట్‌ఫ్లిక్స్‌లో తొలగించారు.


అయితే, ఈ చిత్రం మరో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో అందుబాటులో ఉన్నది. ‘అన్నపూరణి’ చిత్రం నయనతార 75వ సినిమా. విశ్వహిందు పరిషత్‌ హెచ్చరికల నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్‌ స్ట్రీమింగ్‌ను నిలిపివేసింది. అయితే, చిత్రం ఇప్పటికీ ‘సింప్లీ సౌత్‌’లో స్ట్రీమింగ్‌ అవుతున్నది. యూఎస్‌లో సబ్‌స్క్రిప్షన్‌ ఉన్న వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, తమిళ వెర్షన్‌ మాత్రమే చూసే వెసులుబాటు ఉన్నది. చిత్రం వివాదం నేపథ్యంలో మహారాష్ట్రలోని థానే జిల్లాలో ‘అన్నపూర్ణని’ హీరోయిన్‌ నయనతారతో పాటు మరో ఏడుగురిపై తాజాగా కేసు నమోదైంది. మీరా భయందర్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు నయానగర్‌ పోలీసులు ఫిర్యాదు చేశారు. లవ్ జిహాద్‌ను సినిమా ప్రోత్సహించేలా ఉందని ఆరోపించారు.


హీరో హీరోయిన్లతో పాటు ఎనిమిది మందిపై భారతీయ శిక్షాస్మృతిలోని 153-ఎ, 295-ఎ, 34, 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు నయానగర్ పోలీస్ స్టేషన్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలిపారు. చిత్రంలో రాముడిని మాంసాహారిగా చెప్పడంతో పెనుదుమారం రేగింది. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో జీ స్టూడియోస్ ఒక ప్రకటనను విడుదల చేసింది. చిత్రంలోని సన్నివేశాలను సరిస్తామని, మార్పులు చేసే వరకు నెట్‌ఫ్లిక్స్ నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. ఎవరి మనోభావాలను దెబ్బతీసే ఉద్దేశం తమకు లేదని.. ఎవరైనా అసౌకర్యానికి గురైతే క్షమాపణలు కోరుతున్నట్లు నిర్మాతలు పేర్కొన్నారు.