Kerala Murders | కేరళలో సంచలనం: ఏకంగా ఆరు హత్యలు చేసి.. స్టేషన్లో లొంగిపోయిన యువకుడు
కేరళ (Kerala)లోని తిరువనంతపురంలో దారుణం చోటు చేసుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా గంటల వ్యవధిలోనే జరిగిన ఆరు హత్యలు సంచలనం రేపుతున్నాయి. వవరాల్లోకి వెళితే.. అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన తమ్ముడు, నానమ్మ, బాబాయ్, పిన్నితో పాటు తన ప్రేయసిని కూడా హత్య చేశాడు. తల్లిపై సైతం దాడి చేయడంతో తీవ్ర గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
ఇదిలా ఉండగా ఈ హత్యల అనంతరం అఫన్ పోలీసులకు స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆరుగురిని చంపాను అంటూ చెప్పి మరి లొంగిపోయాడు. ఆపై విషం తాగినట్లు పోలీసులకు చెప్పడంతో అతన్ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా.. అఫన్ తన తండ్రితో కలిసి విదేశాల్లో ఉంటున్నాడు. ఇటీవలే తన తల్లి క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం తిరువనంతపురం వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram