Air India | ఉద్యోగులకు ఎయిర్ ఇండియా గుడ్‌ న్యూస్‌.. వేతనాల పెంపు, పర్ఫార్మెన్స్‌ బోనస్‌ ప్రకటన

Air India | ఎయిర్ ఇండియా సంస్థ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా గురువారం తన ఉద్యోగులకు వార్షిక వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా పైలట్లకు వార్షిక పనితీరు బోనస్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ వార్షిక వేతనాల పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 అమలు కానున్నట్లు ఎయిర్ ఇండియా సీహెచ్‌ఆర్ఓ రవీంద్ర కుమార్ జీపీ ఒక ప్రకటనలో తెలిపారు.

Air India | ఉద్యోగులకు ఎయిర్ ఇండియా గుడ్‌ న్యూస్‌.. వేతనాల పెంపు, పర్ఫార్మెన్స్‌ బోనస్‌ ప్రకటన

Air India : ఎయిర్ ఇండియా సంస్థ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా గురువారం తన ఉద్యోగులకు వార్షిక వేతనాలు పెంచుతున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా పైలట్లకు వార్షిక పనితీరు బోనస్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ వార్షిక వేతనాల పెంపు ఈ ఏడాది ఏప్రిల్ 1 అమలు కానున్నట్లు ఎయిర్ ఇండియా సీహెచ్‌ఆర్ఓ రవీంద్ర కుమార్ జీపీ ఒక ప్రకటనలో తెలిపారు.

2023-24 ఆర్థిక సంవత్సరానికిగానూ ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ఆధారంగా బోనస్‌ కూడా ప్రకటిస్తున్నట్లు రవీంద్రకుమార్‌ వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంలో ఎయిర్‌లైన్ వృద్ధి, పరివర్తనకు బలమైన పునాదులు వేయడంలో సంస్థ కీలక మైలురాళ్లను టచ్‌ చేసిందని CHRO తెలిపారు. 2022 చివరాఖరులో ప్రకటించిన ఐదు సంవత్సరాల పరివర్తన ప్రణాళిక కింద.. ఎయిర్ ఇండియా ఎయిర్‌లైన్స్ తనను తాను పునరుద్ధరించుకునే ప్రనిలో ఉంది.

రెండేళ్ల క్రితం నష్టాల్లో ఉన్న విమానయాన సంస్థను టాటా గ్రూప్ టేకోవర్ చేసింది. ఉద్యోగులలో వర్క్‌ బేస్డ్‌, టాలెంట్‌ బేస్డ్‌ పర్ఫార్మెన్స్‌ గుర్తింపు సంస్కృతిని పెంపొందించడానికి, ప్రతిభను ఆకర్షించడానికి, నిలుపుకోవడానికి ఎయిర్ ఇండియా వేతనాలను పెంచుతోంది. కొత్త పనితీరు నిర్వహణ వ్యవస్థ (Rise.AI) ఆధారంగా గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ సిబ్బంది, పైలట్‌లతో సహా డిసెంబర్ 31, 2023కి ముందు చేరిన ఉద్యోగులందరికీ కంపెనీ ఫలాలను అందించింది.

ప్రస్తుతం ఎయిర్ ఇండియాలో దాదాపు 18,000 మంది ఉద్యోగులు ఉన్నారు. టాటా గ్రూప్‌లో ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, AIX కనెక్ట్ (గతంలో ఎయిర్ ఏషియా ఇండియా), విస్తారా అనే నాలుగు విమానయాన సంస్థలు ఉన్నాయి.