అక్షయ తృతీయ బంగారం సేల్స్ పెరిగేనా..?
ఆదివారం అక్షయ తృతీయ రోజు ఆదివారం 10గ్రాముల 24క్యారెట్ల బంగారం రూ. 1,55,780వద్ద నిలకడగా కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,42,800వద్ద నిలచింది. కిలో వెండి ధర కూడా హెచ్చుతగ్గులు లేకుండా 2,80,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
విధాత, హైదరాబాద్: పశ్చిమాసిక ఉద్రిక్తతలతో అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక,ఆర్థిక పరిణామాలు బంగారం, వెండి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆదివారం అక్షయ తృతీయ రోజు ఆదివారం 10గ్రాముల 24క్యారెట్ల బంగారం రూ. 1,55,780వద్ద నిలకడగా కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 1,42,800వద్ద నిలచింది. కిలో వెండి ధర కూడా హెచ్చుతగ్గులు లేకుండా 2,80,000 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
అక్షయ తృతీయ రోజు బంగారం ఎప్పుడు కొనాలి..?
హిందూ సంప్రదాయంలో అక్షయ తృతీయ రోజు బంగారం కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తుంటారు. ఈ రోజున చేసే దానధర్మాలు, జపాలు , కొనుగోలు చేసే వస్తువులు ‘అక్షయం’గా (ఎప్పటికీ తరిగిపోనివిగా) ఉంటాయని భక్తుల నమ్మకం. ముఖ్యంగా ఈ రోజున బంగారం కొనడం వల్ల ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయని అందరూ భావిస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ రోజున బంగారం కొనుగోలుకు తిథి మొత్తం శుభప్రదంగా భావించినప్పటికీ, ముఖ్య పూజా ముహూర్తం ఉదయం 10:49 గంటల నుంచి మధ్యాహ్నం 12:20 గంటల వరకు ఉంటుంది. ఆ గంట 32 నిమిషాల సమయం లక్ష్మీ పూజ, కొత్త వ్యాపారాల ప్రారంభం, బంగారం కొనుగోలు వంటి కార్యక్రమాలకు అత్యంత అనుకూలంగా చెబుతున్నారు.హైదరాబాద్‌లో 12:15 వరకు బంగారం కొనుగోలుకు మంచి సమయంగా భావిస్తున్నారు. ఏప్రిల్ 20 ఉదయం 5:51 నుంచి 7:27 వరకు కూడా అమృత ముహూర్తంగా భావిస్తారు. అందువల్ల ఏప్రిల్ 19 మధ్యాహ్నం వరకు కొనలేని వారు 20వ తేదీ తెల్లవారుజాము వరకు కొనవచ్చు.
భవిష్యత్తులో ధరలు పెరుగవచ్చు..
ఏప్రిల్ 2025లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 94,611 ఉండగా, ఏప్రిల్ 2026 నాటికి అది రూ. 1,55,7801కి చేరింది. అంటే కేవలం ఏడాది కాలంలోనే తులం బంగారంపై సుమారు రూ. 60,000 వరకు లాభం చేకూరింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా, వచ్చే ఏడాది అక్షయ తృతీయ నాటికి 10 గ్రాముల పసిడి ధర రూ. 2,00,000 మార్కును తాకే అవకాశం ఉందని విశ్లేషకులు బలంగా విశ్వసిస్తున్నారు. 2026 డిసెంబర్ చివరి నాటికే ధరలు రూ. 1,75,000 వరకు చేరవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram