ఆపిల్‌ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ డీల్స్‌.. రూ.34వేలకే ఐఫోన్‌-14 ప్లస్‌ సొంతం చేసుకోండి..!

ఆపిల్‌ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్‌లో క్రేజీ డీల్స్‌.. రూ.34వేలకే ఐఫోన్‌-14 ప్లస్‌ సొంతం చేసుకోండి..!

విధాత‌: ఆపిల్‌ ప్రియులకు గుడ్‌న్యూస్‌. ఐఫోన్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకోవాలనుకునే వారికి నిజంగా ఇదో క్రేజీ న్యూస్‌. ఐఫోన్‌ 14 ప్లస్‌పై ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ బంపర్‌ ఆఫర్‌ను ప్రకటించింది. అలాగే భారీగా క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్‌ను సైతం ఇస్తున్నది.


ఐఫోన్‌-14 ప్లస్‌ను కేవలం రూ.73,900 సొంతం చేసుకునే అవకాశం ఉండగా.. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా క్రెడిట్‌ కార్డు ఉన్న వారికి అదనంగా మరో 10శాతం ఇన్‌స్టంట్‌ డిస్కంట్‌ ఇస్తున్నది. రూ.1500 వరకు డిస్కౌంట్‌ రావడంతో పాటు అదనంగా ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ సైతం అందుబాటులో ఉంది.


గరిష్ఠంగా ఫోన్‌ మోడల్‌ను బట్టి రూ.39,150 వరకు తగ్గనున్నది. ఐఫోన్-14 ప్లస్‌ మొబైల్‌ను కేవలం రూ.34వేలకే సొంతం చేసుకునే అవకాశం ఉన్నది. అయితే, ఎక్స్ఛేంజ్‌ చేసే ఫోన్‌ బ్రాండ్‌, వర్కింగ్‌ కండిషన్‌, మోడల్‌ను బట్టి ధర మారుతూ ఉంటుంది. ఇక ఐఫోన్‌-14 ప్లస్‌ స్పెసిఫికేషన్స్‌ విషయానికి వస్తే.. 128 జీబీ స్టోరేజ్ కెపాసిటీ ఉంటుంది.


సూపర్ రెటినా ఎక్స్ డీఆర్ 6.7-అంగుళాల డిస్‌ప్లే, 12 ఎంపీ ప్రధాన కెమెరా, 12 ఎంపీ అల్ట్రా-వైడ్ కెమెరా సెటప్ కలిగి ఉంది. ఐఫోన్-14 ప్లస్‌లో వైర్‌లెస్ ఛార్జింగ్ ఫెసిలిటీ ఉండగా.. ఇది కేవలం 30 నిమిషాల్లో 50శాతం వరకు వేగంగా ఛార్జ్ చేస్తుంది. గరిష్ఠంగా 26 గంటల ప్లే బ్యాక్‌ టైమ్‌, 20 గంటల స్ట్రీమింగ్‌, 100 గంటల ఆడియో ప్లే బ్యాక్‌ టైమ్‌తో వస్తుంది.