Bank Holidays | జులైలో బ్యాంకులకు సెలవులే సెలవులు.. ఎన్ని రోజులంటే..?
Bank Holidays | జులై( July ) నెల నేటితో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈ నెలలో బ్యాంకులకు( Banks ) సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank of India ) ప్రకటించింది.

Bank Holidays | జులై( July ) నెల నేటితో ప్రారంభమైంది. ఈ క్రమంలో ఈ నెలలో బ్యాంకులకు( Banks ) సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా( Reserve Bank of India ) ప్రకటించింది. ఆర్బీఐ( RBI ) క్యాలెండర్ ప్రకారం.. జులై నెలలో మొత్తం 13 రోజులు బ్యాంకులు మూసివేయనున్నారు. ఈ సెలవుల్లో శని, ఆదివారాలతో పాటు ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి.
భారీగా సెలవులు ఉన్న నేపథ్యంలో ఈ నెలలో ఏదైనా బ్యాంక్ పని ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి. సెలవులు పోనూ ఈ నెలలో బ్యాంకులు 18 రోజులు మాత్రమే పనిచేస్తాయి. అయితే బ్యాంకుకు వెళ్లే పని లేకుండా మీరు ఇంట్లోనే కూర్చుని లావాదేవీలు చేయవచ్చు. మీకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే మీ మొబైల్ ద్వారానే మీ పనులను సులభంగా నిర్వహించుకోవచ్చు.
జులైలో బ్యాంకు సెలవులు
జులై 3 (గురువారం) – త్రిపురలోని అగర్తలాలో ఖర్చి పూజ సందర్భంగా బ్యాంకులు మూసివేయడం జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి.
జులై 5 (శనివారం) – జమ్మూ కశ్మీర్ లో గురు హరోబింద్ జీ జయంతి సందర్భంగా మూసివేత ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.
జులై 6 – ఆదివారం. దేశమంతటా బ్యాంకులు పనిచేయవు.
జులై 12 – రెండో శనివారం సందర్భంగా దేశమంతటా బ్యాంకులు పనిచేయవు.
జులై 13- ఆదివారం సందర్భంగా దేశమంతటా బ్యాంకులు పనిచేయవు.
జులై 14 (సోమవారం) – మేఘాలయలోని షిల్లాంగ్ లో బెహ్ దేంఖ్లామ్ ఫెస్టివల్ సందర్భంగా బ్యాంకులు క్లోజ్ అవుతాయి. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి.
జులై 16 (బుధవారం) – ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో హరేలా ఫెస్టివల్ సందర్భంగా బ్యాంకులు మూసివేయడం జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి.
జులై 17 (గురువారం) – మేఘాలయలోని షిల్లాంగ్ లో యు తిరోత్ సింగ్ వర్ధంతి సందర్భంగా బ్యాంకులు మూసివేయడం జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి.
జులై 19 (శనివారం) – త్రిపురలోని అగర్తలాలో కేర్ పూజ సందర్భంగా బ్యాంకులు మూసివేయడం జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి.
జులై 20 – ఆదివారం సందర్భంగా దేశమంతటా బ్యాంకులు పనిచేయవు.
జులై 26 – నాలుగో శనివారం సందర్భంగా దేశమంతటా బ్యాంకులు పనిచేయవు.
జులై 27 – ఆదివారం సందర్భంగా దేశమంతటా బ్యాంకులు పనిచేయవు.
జులై 28 (సోమవారం) – సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో ద్రుక్పా త్షె-జీ సందర్భంగా మూసివేత ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.