Bank Holidays | బ్యాంకులకు వరుసగా రెండురోజుల సెలవులు.. ఏవైనా పనులుంటే వెంటనే చేసుకోండి మరి..!
Bank Holidays | సెప్టెంబర్ నెల దగ్గరపడుతున్నది. అక్టోబర్ నెల మొదలను కానున్నది. అక్టోబర్‌లో దాదాపు 15 రోజులే బ్యాంకులు పని చేయనున్నారు. పండుగలతో పాటు నెలవారీ సెలవులు రానున్నాయి. ఏవైనా పనులుంటే ముందే చెక్కబెట్టుకోవడం మంచిది లేకపోతే.. అత్యవసర సమయాల్లో ఇబ్బందులుపడే అవకాశాలుంటాయి.

Bank Holidays | సెప్టెంబర్ నెల దగ్గరపడుతున్నది. అక్టోబర్ నెల మొదలను కానున్నది. అక్టోబర్‌లో దాదాపు 15 రోజులే బ్యాంకులు పని చేయనున్నారు. పండుగలతో పాటు నెలవారీ సెలవులు రానున్నాయి. ఏవైనా పనులుంటే ముందే చెక్కబెట్టుకోవడం మంచిది లేకపోతే.. అత్యవసర సమయాల్లో ఇబ్బందులుపడే అవకాశాలుంటాయి. స్థానికత ఆధారంగా బ్యాంకులకు సెలవులు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలో సెప్టెంబర్‌లోని ఈ చివరి వారంలో వరుసగా రెండు రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. ఈ నెల 28న బ్యాంకులకు దేశవ్యాప్తంగా సెలవులు ఉన్నాయి. నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అలాగే, 29న ఆదివారం కావడంతో సెలవు. ఈ క్రమంలో వరుసగా రెండురోజుల సెలవులు రావడంతో ఏవైనా బ్యాంకు పనులుంటే శుక్రవారంలోగా పూర్తి చేసుకోవడం మంచిది.
అయితే, బ్యాంకులకు సెలవులు ఉన్నా ఇంటర్‌నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవులు యథావిధిగా కొనసాగనున్నాయి. నెట్, మొబైల్ బ్యాంకింగ్ సర్వీసులతో డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేసుకునేందుకు అవకాశం ఉంది. ఏటీఎంలను డబ్బులను విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే, చెక్కులు ఇతర పనుల కోసం బ్యాంకులకు తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సెలవులను చూసుకొని.. ఏవైనా బ్యాంకు సంబంధిత పనులు ఉంటే ముందే చేసుకోవడం ద్వారా ఇబ్బందులు ఉండవు. ఇక అక్టోబర్‌లో 15 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. గాంధీ జయంతి, దసరా, దీపావళి పండుగ సెలవులు రానున్నాయి. ఆర్‌బీఐ బ్యాంకుల సెలవులను క్యాలెండర్‌ని విడుదల చేసింది. పండుగలు, స్థానికంగా ప్రత్యేక రోజులు, వారాంతపు సెలవులను దృష్టిలో పెట్టుకొని ఆర్‌బీఐ జాబితాను విడుదల చేస్తుంది.