Bank Holidays | అక్టోబర్‌లో 15 రోజులు బ్యాంకులు మూతే..! పనులన్నీ ముందే చక్కబెట్టుకోండి మరి..!
Bank Holidays | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల మారింది. సెప్టెంబర్ ముగిసి అక్టోబర్ నెల మొదలైంది. ఈ మాసం దాదాపు 15రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం కీలకం.

Bank Holidays | ఈ ఆర్థిక సంవత్సరంలో మరో నెల మారింది. సెప్టెంబర్ ముగిసి అక్టోబర్ నెల మొదలైంది. ఈ మాసం దాదాపు 15రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల సెలవులకు సంబంధించిన జాబితాను ఆర్బీఐ విడుదల చేసింది. ఏవైనా ఆర్థిక సంబంధిత పనుల కోసం వెళ్లేవారు ఏయే రోజుల్లో బ్యాంకులు పని చేస్తాయో.. సెలవులుంటాయో తెలుసుకోవడం కీలకం. సాధారణ సెలవులతో పాటు పండుగ సెలవులు కలుపుకొని 15 రోజులు సెలవులు రానున్నాయి. దసరా, దీపావళితో పాటు వారాంతపు సెలవులు సైతం ఉన్నాయి. అయితే, బ్యాంకులు మూసి ఉన్నా మొబైల్, ఇంటర్‌నెట్ బ్యాంక్, యూపీఐ సర్వీసులు నిరంతరాయంగా పని చేస్తుంటాయి. డబ్బుల లావాదేవీలకు వీలుంటుంది. నగదు ఉపసంహరణ కోసం ఏటీఎంలు అందుబాటులో ఉండనున్నాయి. పలు బ్యాంకులు క్యాష్‌డిపాజిట్ మిషన్స్ సైతం అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇందులో అకౌంట్లలో డబ్బులు చేసుకునే వీలున్నది. కొన్ని సేవల కోసం బ్యాంకులకు వెళ్లే అవసరం ఉంటుంది. అలాంటి సమాచారం సెలవుల గురించి సమాచారం ఉంటే.. ముందస్తుగానే పనులు చేసుకునే అవకాశం ఉంటుంది.
సెలవులు జాబితా ఇదే..
అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికలతో జమ్మూలో బ్యాంకుల మూసివేత
2న గాంధీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలీడే.
3న నవరాత్రి వేడుకల సందర్భంగా జైపూర్‌లో సెలవు.
6న ఆదివారం సెలవు.
10న దుర్గాపూజ కారణంగా అగర్తలా, గౌహతి, కోహిమా, కోల్‌కతాలో హాలీడే.
11న దసరా, దుర్గాపూజ సందర్భంగా బ్యాంకులకు సెలవులు.
12న రెండోశనివారం బ్యాంకులకు హాలీడే.
13న ఆదివారం సెలవు.
14న దుర్గాపూజ, దాసేన్ కారణంగా గాంగ్‌టక్‌లో సెలవు.
16న లక్ష్మీపూజ కారణంగా అగర్తలా, కోల్‌కోతాలో హాలీడే.
17న వాల్మీకి జయంతి బెంగళూరు.. గౌహతిలో హాలీడే.
20న ఆదివారం సెలవు.
26న శనివారం హాలీడే.
27న ఆదివారం సెలవు
31న దీపావలి సందర్భంగా దేశవ్యాప్తంగా హాలీడే.