పసిడికి బ్రేక్.. తగ్గిన బంగారం

పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. వరసగా నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది.. ఈరోజు పుత్తడి ధరలు కిందకు దిగివచ్చాయి.. పసిడి ధర వెలవెలబోతోంది.. బంగారం ధర దిగివచ్చింది.. ఈరోజు బంగారం, వెండి రేట్లు ఇలా.. మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి ఏకంగా రూ. 510 తగ్గింది.. దీంతో ఈరోజు ధర […]

  • Publish Date - May 11, 2021 / 04:03 AM IST

పసిడి ప్రియులకు శుభవార్త.. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్ న్యూస్.. వరసగా నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు ఈరోజు బ్రేక్ పడింది.. ఈరోజు పుత్తడి ధరలు కిందకు దిగివచ్చాయి.. పసిడి ధర వెలవెలబోతోంది.. బంగారం ధర దిగివచ్చింది.. ఈరోజు బంగారం, వెండి రేట్లు ఇలా..

మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నిన్నటి ధరకి ఏకంగా రూ. 510 తగ్గింది.. దీంతో ఈరోజు ధర రూ 48,670 కి క్షీణించింది.. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర లో ఎలాంటి మార్పు లేదు.. దీంతో ఈరోజు నిన్నటి ధర రూ.44,610 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.. చెన్నై, విజయవాడ, వైజాగ్, మంగళూరు, భువనేశ్వర్, కేరళ లో కూడా బంగారం ధరలు ఇలానే ఉన్నాయి.. పసిడి రేటు ఔన్స్ కు 1836 డాలర్లకు తగ్గింది. అంతర్జతీయ మార్కెట్లో పసిడి పడిపోవడంతో దేశీయ మార్కెట్లను అదే ట్రెండ్ కొనసాగినట్లు బులియన్ మార్కెట్లో నిపుణులు చెబుతున్నారు.. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న వెండి ధరలు ఈరోజు పైపైకి కదిలాయి.. వెండి ధర రూ.400 పెరిగింది.. దీంతో ఈరోజు కిలో వెండి ధర రూ.76,500 కు చేరింది..