BSNL | మరో సరికొత్త రీచార్జ్ ప్లాన్ ప్రకటించిన బీఎస్‌ఎన్‌ఎల్.. రూ.340తో 60 రోజుల వ్యాలిడిటీ
BSNL | ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎస్‌ఎల్ దూకుడు కొనసాగుతున్నది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్‌తో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే తక్కువ ధరకే వివిధ ప్లాన్‌ని తీసుకువస్తున్నది. ఈ క్రమంలో ప్రైవేట్ టెలికం సంస్థలకు చెందిన యూజర్లు పెద్ద ఎత్తున బీఎస్‌ఎన్‌ఎల్‌కి పోర్టవుతున్నారు.

BSNL | ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్‌ఎస్‌ఎల్ దూకుడు కొనసాగుతున్నది. ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్స్‌తో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నది. ఇందులో భాగంగానే తక్కువ ధరకే వివిధ ప్లాన్‌ని తీసుకువస్తున్నది. ఈ క్రమంలో ప్రైవేట్ టెలికం సంస్థలకు చెందిన యూజర్లు పెద్ద ఎత్తున బీఎస్‌ఎన్‌ఎల్‌కి పోర్టవుతున్నారు. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్ తదితర ప్రైవేటు టెలికం కంపెనీ టారిఫ్స్‌ని భారీగా పెంచిన విషయం తెలిసిందే. దాదాపు 15శాతం వరకు ధరలను పెంచడమే ప్రధాన కారణం. ఇదిలా ఉండగా.. బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా రూ.340కే అపరిమిత కాలింగ్, డేటా, ఎస్‌ఎంఎస్ ప్లాన్‌ని తీసుకువచ్చింది. 340 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌లో 60 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే అపరిమిత వాయిస్ కాల్స్‌తో పాటు వంద ఎస్‌ఎంఎస్‌లు సైతం ఉచితంగా ఇవ్వనున్నది.
ఇక ప్రతి రోజు ఒక జీబీ డేటా పొందుతారు. ఆ తర్వాత 40 కేబీపీఎస్ నెట్ స్పీడ్‌తో నెట్ వస్తుంది. ఇక బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్ ప్రైవేట్ టెలికం కంపెనీలకు సవాల్ విసురుతున్నది. బీఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా 3జీ సేవలను విస్తరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 3జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆ తర్వాత 4జీ సేవలను విస్తరించనున్నది. బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ విస్తరణ ప్రకటన అనంతరం ప్రైవేట్ టెలికం కంపెనీలకు షాక్ ఇచ్చింది. అదే సమయంలో కంపెనీ టారిఫ్ ధరలను భారీగా పెంచడంతో యూజర్లు పెద్ద ఎత్తున ఆయా కంపెనీలకు గుడ్‌బై చెప్పి బీఎస్‌ఎన్‌ఎల్‌కు పోర్ట్ అవుతూ వస్తున్నారు. దాదాపు ఇప్పటి వరకు బీఎస్‌ఎన్‌ఎల్ 29లక్షలపైగా సబ్‌స్క్రైబర్స్‌ని కొత్తగా చేర్చుకున్నది. జియో 7.50లక్షలు, ఎయిర్‌టెల్ 16లక్షలకుపైగా యూజర్లను పోగొట్టుకున్నాయి. దాంతో బీఎస్‌ఎన్‌ఎల్ యూజర్ల సంఖ్య 29.3 కోట్లకు పెరిగింది.