BSNL Plans | ప్రైవేట్ టెలికం సంస్థలకు దబిడి దిబిడే..! తక్కువ ధరతో మరో సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్..!
BSNL Plans | ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే పలు నగరాల్లో ప్రారంభించగా.. దశలవారీగా మిగతా నగరాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

BSNL Plans | ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ దేశవ్యాప్తంగా 4జీ సేవలను ప్రారంభించింది. ఇప్పటికే పలు నగరాల్లో ప్రారంభించగా.. దశలవారీగా మిగతా నగరాల్లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఆ తర్వాత 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. మరో వైపు ప్రముఖ ప్రైవేటు టెలికం కంపెనీలు రిలయన్స్, జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలో ఇటీవల టారిఫ్‌లను పెద్ద ఎత్తున పెంచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చాలామంది యూజర్లు బీఎస్‌ఎన్‌ఎల వైపు తమ దృష్టిని సారిస్తున్నారు. ఇదే అదునుగా బీఎస్‌ఎన్‌ఎల్ సైతం సరికొత్త ప్లాన్స్‌ను తీసుకువస్తున్నది. ఈ క్రమంలోనే తాజాగా 160 రోజుల వ్యాలిడిటీతో మరో కొత్త ప్లాన్‌ను లాంచ్ చేసింది. కొత్తగా 160 రోజుల ప్లాన్ యూజర్లను విశేషంగా ఆకర్షిస్తున్నది. ఇందులో 320 జీబీ డేటా లభిస్తున్నది. రోజుకు 2జీబీ డేటా చొప్పున 160 రోజులు వస్తుంది. అంతేకాకుండా 160 రోజుల ప్రీ పెయిడ్ ప్లాన్ ధర కేవలం రూ.997 మాత్రమే. అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు సైతం ఉంటాయి.
ఇతర టెలికం కంపెనీలతో పోలిస్తే.. బీఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ధరకే బెస్ట్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏకంగా ఆరు నెలలపాటు వ్యాలిడిటీ వస్తుంది. ఇంకా దేశవ్యాప్తంగా ఫ్రీ రోమింగ్ సదుపాయం సైతం ఉంటుంది. రోజుకు 2 జీబీ డేటా ఇచ్చే ప్లాన్స్ ఇతర కంపెనీల్లో 84 రోజుల వ్యాలిడిటీకి దాదాపుగా రూ.800 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బీఎస్‌ఎన్‌ఎల్ రూ.997కే 160 రోజుల వ్యాలిడిటీ అంటే బెస్ట్ ఆఫర్. అంతేకాకుండా వార్షిక ప్లాన్ సైతం ఇతర కంపెనీలతో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ తక్కువ ధరకే అందిస్తున్నది రూ.1999 ప్రీ పెయిడ్ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. ఇందులో 600 జీబీ డేటా ఉంటుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉంటుంది. ఇదే ఇతర ప్రైవేట్ టెలికం ప్లాన్స్‌లో పరిశీలిస్తే రోజుకు 1.5 జీబీ డేటాతో రూ.3500 ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉన్నది. ఇక కొత్తగా మరో ప్లాన్ 395 రోజుల వ్యాలిడిటీతో రాబోతున్నది. ఈ ప్లాన్‌లో రోజుకు 2 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ సైతం ఉంటాయి. ఈ ప్లాన్ రూ.2399. ఏ రకంగా చూసినా జియో, ఎయిర్‌టెల్, ఐడియా, వొడాఫోన్ ఐడియా ప్లాన్స్‌తో పోలిస్తే 60శాతం వరకు డబ్బులను ఆదా చేసుకునే అవకాశం ఉన్నది.