Amazon Offers | స్మార్ట్ ఫోన్‌లపై అదిరిపోయే ఆఫర్స్.. అమెజాన్‌లో భారీ డిస్కౌంట్స్..!
Amazon Offers | ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో సమ్మర్ సేల్ జోరుగా కొనసాగుతోంది. సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్‌లు దాదాపు సగం ధరకే లభిస్తున్నాయి. కొన్ని స్మార్ట్‌ఫోన్లపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రియల్ మీ నార్జో 70x 5G ఫోన్‌ను తక్కువ ధరకు పొందవచ్చు. ఈ శక్తివంతమైన 5G ఫోన్‌ను రూ.16,999కి బదులుగా రూ.10,999 కే సొంతం చేసుకోవచ్చు.
Amazon Offer : ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో సమ్మర్ సేల్ జోరుగా కొనసాగుతోంది. సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్‌లు దాదాపు సగం ధరకే లభిస్తున్నాయి. కొన్ని స్మార్ట్‌ఫోన్లపై బ్యాంక్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రియల్ మీ నార్జో 70x 5G ఫోన్‌ను తక్కువ ధరకు పొందవచ్చు. ఈ శక్తివంతమైన 5G ఫోన్‌ను రూ.16,999కి బదులుగా రూ.10,999 కే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్‌లో రియల్ మీ నార్జో 70x 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.16,999గా ఉంది. సేల్‌లో భాగంగా దీనిపై 29 శాతం డిస్కౌంట్ ప్రకటించారు. అంతేకాకుండా రూ.1000 కూపన్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. వీటిని ఉపయోగించుకొని ఈ ఫోన్‌ను కేవలం రూ.10,999 కే దక్కించుకోవచ్చు. పైగా ఈఎంఐ ఆప్షన్‌ను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ఫోన్ 4 GB RAM + 128 GB స్టోరేజ్, 6 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఫారెస్ట్ గ్రీన్, ఐస్ బ్లూ కలర్‌లు అందుబాటులో ఉన్నాయి.
రియల్ మీ నార్జో 70x 5G స్మార్ట్ ఫోన్ 6.72 అంగుళాల పూర్తి HD + LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1,080 × 2,400 పిక్సెల్ రిజల్యూషన్‌తో కూడా వస్తున్నది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఇది డైనమిక్ ర్యామ్ ఫీచర్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీన్ని 2TB వరకు పెంచుకోవచ్చు. పైగా ఈ ఫోన్‌కు మూడేళ్ల సెక్యూరిటీ అప్‌డేట్‌లను, రెండేళ్ల OS అప్‌డేట్‌లను కంపెనీ ఇస్తుంది.
ఈ ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంటుంది. దీన్ని సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇందులో మినీ క్యాప్సూల్ 2.0 ఫీచర్.. బ్యాటరీ అలర్ట్, ఛార్జింగ్ పర్సంటేజ్‌ను చూపిస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram