Income Tax On Gifts : గిఫ్ట్స్ స్వీకరిస్తే ట్యాక్స్ చెల్లించాలా? ఎవరికీ మినహాయింపులున్నాయి?
గిఫ్ట్ విలువ రూ.50 వేల దాటితే ట్యాక్స్ వర్తిస్తుంది. అయితే దగ్గరి బంధువులు, పెళ్లిళ్లలో వచ్చే గిఫ్ట్స్‌కు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఏ గిఫ్ట్స్‌కు ట్యాక్స్ పడుతుందో తెలుసుకోండి.
మీ పెళ్లి రోజునో, లేదా మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ సందర్భంగా మీ స్నేహితులు, బంధువులు ఎవరైనా మీకు గిఫ్ట్ పంపితే ట్యాక్స్ చెల్లించాలా? అసలు గిఫ్ట్ ట్యాక్స్ అంటే ఏంటి? ఎలాంటి గిఫ్ట్స్ పంపితే ట్యాక్స్ చెల్లించాల్సి వస్తుంది? ఎవరు గిఫ్ట్స్ పంపినా ట్యాక్స్ మినహాయింపు ఉంటుందనే విషయాలపై సమగ్రంగా తెలుసుకుందాం.
గిఫ్ట్ స్వీకరిస్తే ట్యాక్స్ కట్టాల్సిందేనా?
గిఫ్ట్ వచ్చినా ట్యాక్స్ కట్టాల్సిందే. అయితే కొందరి నుంచి వచ్చే గిఫ్ట్స్ కు ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు. బంగారం, నగదు, స్థిర, చర ఆస్తుల రూపంలో వచ్చే గిఫ్ట్స్ కు ట్యాక్స్ ఉంటుంది. అయితే రూ. 50 వేల లోపు గిఫ్ట్స్ కు మాత్రమే ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే బంధువు కానీ, వ్యక్తి నుంచి మీరు రూ. 50వేల కంటే ఎక్కువ విలువైన బంగారం, నగదు, ఆభరణాలు లేదా ఇతర ఏమైనా గిఫ్ట్ రూపంలో స్వీకరిస్తే దానికి ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 1961 ఆదాయ పన్ను చట్టం సెక్షన్ 56 ప్రకారం… గిఫ్ట్స్ పై ట్యాక్స్ విధిస్తారు. అయితే బంధువుల నుంచి వచ్చిన గిఫ్ట్స్ కు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు.
ఎలాంటి గిఫ్ట్స్ నకు ట్యాక్స్ ఉండదు?
దగ్గరి బంధుత్వం ఉన్నవారు పంపిన గిఫ్ట్స్ కు ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. జీవిత భాగస్వామి, పేరేంట్స్ , తోబుట్టువులు, అత్త, మామ, వారసులు దగ్గరి బంధువుల పరిధిలోకి వస్తారు. ఇలాంటి బంధుత్వం ఉన్నవారు పంపిన బహుమతులు రూ. 50 వేలు దాటినా కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. వివాహ సమయంలో వచ్చే గిఫ్ట్స్ నకు కూడా ఇది వర్తిస్తుంది. అయితే పెళ్లి సమయంలో ఇచ్చే గిఫ్ట్స్ దగ్గరి బంధువులతో సంబంధం లేకుండా ఇతరుల నుంచి గిఫ్ట్స్ నకు కూడా ట్యాక్స్ ఉండదు. ఒక ఆర్ధిక సంవత్సరంలో దగ్గరి బంధువు నుంచి 50 వేల కంటే ఎక్కువ విలువైన బహుమతిని స్వీకరిస్తే ట్యాక్స్ చెల్లించాల్సిందే. బంగారం, ఆభరణాలు, నగదు, చెక్, డీడీ లేదా ఇతర రూపంలో వచ్చినా కూడా ట్యాక్స్ మాత్రం కట్టాలి. వీలునామా రూపంలో వచ్చిన ఆస్తులు, వారసత్వంగా సక్రమించిన ఆస్తులకు ట్యాక్స్ ఉండదు.
బంగారం గిఫ్ట్ గా ఇస్తే……
ఫంక్షన్లు, పెళ్లిళ్లు, లేదా ఏ ఇతర శుభ కార్యం జరిగినా మన ఇండియన్లు బంగారాన్ని బహుమతిగా ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తారు. దగ్గరి బంధువుల నుంచి బంగారం గిఫ్ట్ గా పొందితే ఇబ్బంది లేదు. అయితే దగ్గరి బంధువు కానీ వారి నుంచి 50 వేల కంటే ఎక్కువ విలువైన బంగారాన్ని గిఫ్ట్ గా స్వీకరిస్తే ట్యాక్స్ చెల్లించాలి. ఒకవేళ ఈ బంగారాన్ని విక్రయిస్తే మీరు దాన్ని ఎంతకాలం కలిగి ఉన్నారనే దాని ఆధారంగా మూలధన లాభాల పన్ను కూడా విధిస్తారు. అయితే ఇలాంటి గోల్డ్ విక్రయించకుండా ఇంట్లోనే ఉంచుకుంటే ట్యాక్స్ నుంచి మినహాయింపు పొందవచ్చు.
ఐటీ రిటర్న్స్‌లో నమోదు చేయాలి
మీరు స్వీకరించిన గిఫ్ట్స్ నకు సంబంధించిన వివరాలను ఐటీ రిటర్న్స్ లో నమోదు చేయించాలి. 50 వేల రూపాయాల కంటే ఎక్కువ విలువైన బహుమతులు స్వీకరిస్తే ఐటీ రిటర్న్స్ లో తెలపాలి. పెద్ద పెద్ద కుటుంబాల్లో దగ్గరి బంధువుల నుంచి స్వీకరించిన గిఫ్ట్స్ నకు సంబంధించి ఐటీఆర్ లో తెలపాలి. మీరు గిఫ్ట్ గా స్వీకరించిన దాని నుంచి పొందిన ఆదాయంపై ట్యాక్స్ చెల్లించాలి. అంటే మీకు మీ కొడుకు రూ. 10 లక్షలు గిఫ్ట్ గా ఇచ్చాడనుకుందాం. ఈ రూ. 10 లక్షలను మీరు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే దానిపై వచ్చే ఆదాయంపై ట్యాక్స్ పడుతుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram