EPFO SOPs | ఈపీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఉద్యోగుల భవిష్య నిధి కొత్త రూల్స్ గురించి తెలుసా..?
EPFO SOPs | ఈపీఎఫ్ ఖాదాదారులకు అలెర్ట్. తాజాగా ఉద్యోగుల భవిష్యత నిధి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వాస్తవానికి ఈపీఎఫ్ సభ్యులందరూ ప్రతినెలా వారి జీతంలో నుంచి 12శాతం పీఎఫ్ అకౌంట్లోకి జమ చేసే విషయం తెలిసిందే. కంపెనీ సైతం అంతే మొత్తంలో డిపాజిట్ చేస్తూ వస్తుంది.

EPFO SOPs | ఈపీఎఫ్ ఖాదాదారులకు అలెర్ట్. తాజాగా ఉద్యోగుల భవిష్యత నిధి కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వాస్తవానికి ఈపీఎఫ్ సభ్యులందరూ ప్రతినెలా వారి జీతంలో నుంచి 12శాతం పీఎఫ్ అకౌంట్లోకి జమ చేసే విషయం తెలిసిందే. కంపెనీ సైతం అంతే మొత్తంలో డిపాజిట్ చేస్తూ వస్తుంది. ఈపీఎఫ్ అకౌంట్‌లో జమయ్యే ఈ మొత్తం ఉద్యోగుల భవిష్యత్‌కు సురక్షితమైన పెట్టుబడిగా ఉంటుంది. ఈపీఎఫ్ ఎప్పటికప్పుడు చందాదారుల సౌలభ్యం కోసం నిబంధనలను మారుస్తూ వస్తుంది. తాజాగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌లో సభ్యుల వివరాలను అప్‌డేట్ చేసేందుకు.. తప్పులుంటే సరి చేసుకునేందుకు వీలు కల్పించింది.
యూఏఎన్ ప్రొఫైల్‌లో పుట్టిన తేదీ, ఇతర సమాచారంలో ఏదైనా సవరణ కోసం.. ఖాతాదారు ధ్రువీకరణ కోసం అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఇందు కోసం ఆధార్, పాన్, పాస్‌పోర్ట్‌ను సమర్పించేందుకు వీలు కల్పించింది. పేరు, పుట్టిన తేదీ, ప్రొఫైల్‌లో వ్యక్తిగత సమాచారాన్ని సవరించేందుకు కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఎస్‌ఓపీ వెర్షన్ 3.0 కింద జారీ చేసింది. కొత్త మార్గదర్శకాల్లో చందాదారులు తమ ప్రొఫైల్‌లో తప్పులను సరిదిద్దుకోవడంలో తరుచుగా ఇబ్బందులుపడుతున్నారని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది. ప్రధానంగా డేటా అప్‌డేట్ కాకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పింది. పేరులో చిన్న చిన్న తప్పులు, పుట్టిన తేదీలో చిన్న తేడాలు చిన్న మార్పులను సరిచేయడానికి, ఖాతాదారులు జాయింట్ డిక్లరేషన్‌తో పాటు కనీసం రెండు పత్రాలను సమర్పించాల్సి ఉంటుందని పేర్కొంది. ఆధార్‌కార్డ్, పాన్ కార్డ్‌తో పాటు ఇతర ప్రభుత్వం జారీ చేసిన పత్రాల్లో ఏవైనా సమర్పించవచ్చని తెలిపింది.