Gold-Silver Rates | బంగారం ధర తగ్గిందోచ్‌.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..!

Gold-Silver Rates | బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్‌. పసిడి ధరలు సోమవారం బులియన్‌ మార్కెట్‌లో స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గి తులానికి రూ.67,700కి చేరింది. 24 పుత్తడిపై రూ.120 తగ్గి తులానికి రూ.73,850కి పతనమైంది.

Reported by: Mallanna | వాణిజ్యం | Jul 22, 2024, 10:34 am IST
Read Time: 3 mins
Gold-Silver Rates | బంగారం ధర తగ్గిందోచ్‌.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు ఇవే..!

Gold-Silver Rates | బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్‌. పసిడి ధరలు సోమవారం బులియన్‌ మార్కెట్‌లో స్వల్పంగా దిగివచ్చాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గి తులానికి రూ.67,700కి చేరింది. 24 పుత్తడిపై రూ.120 తగ్గి తులానికి రూ.73,850కి పతనమైంది. మరోవైపు వెండి ధర నిలకడగా కొనసాగుతున్నది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల పసిడి రూ.68,250 ఉండగా.. 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రూ.74,450కి తగ్గింది. ఆర్థిక రాజధాని ముంబయి నగరంలో 22 క్యారెట్స్‌ స్వర్ణం రూ.67,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,850కి దిగివచ్చింది. ఇక దేశ ఆర్థిక రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి రూ.67,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,850కి తగ్గింది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్స్‌ బంగారం రూ.67,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,850కి దిగివచ్చింది. ఇక వెండి నిలకడగా కొనసాగుతున్నది. ప్రస్తుతం ఢిల్లీలో కిలోకు రూ.91,500 వద్ద కొనసాగుతున్నది. ఇక హైదరాబాద్‌లో కిలోకు రూ.96వేల వద్ద స్థిరంగా ఉన్నది. బంగారం, వెండి ధరలు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆయా రాష్ట్రాల్లోని పన్నుల ఆధారంగా ధర మారుతుంది. మరో వైపు ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.