తగ్గిన బంగారం, వెండి ధరలు

భారత్ లో దేశీయంగా బంగారం దిగుమతులపై కొనసాగుతున్న ఆంక్షలతో ధరలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 380 తగ్గి రూ. 1,55,730వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 350 తగ్గి రూ. 1,55,730వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం వరుసగా రెండో రోజు కూడా మరోసారి రూ. 5000 తగ్గి రూ. 2,80,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | Jun 05, 2026, 12:42 pm IST
Read Time: 3 mins
తగ్గిన బంగారం, వెండి ధరలు

పశ్చిమాసియా ఉద్రిక్తతలు కాస్తా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు మెల్లగా పుంజుకుంటున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న అలజడుల మధ్య, ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు రక్షణగా భావించే పసిడి వెలుగుల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే భారత్ లో దేశీయంగా బంగారం దిగుమతులపై కొనసాగుతున్న ఆంక్షలతో ధరలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 380 తగ్గి రూ. 1,55,730వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 350 తగ్గి రూ. 1,55,730వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం వరుసగా రెండో రోజు కూడా మరోసారి రూ. 5000 తగ్గి రూ. 2,80,000వద్ద కొనసాగుతుంది.

దీర్ఘకాలంలో పుంజుకోనున్న ధరలు

ప్రస్తుత సానుకూల వాతావరణం నేపథ్యంలో బంగారం త్వరలోనే రూ.1,65,000 మైలురాయిని తాకడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చని వ్యూహకర్తలు అంచనా వేస్తున్నారు. అందుకే కొనుగోలు ధరలు ప్రస్తుత ధర వద్ద బంగారం కొనుగోలు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. వెండి సైతం దీర్ఘకాలంలో పుంజుకుంటుందని,సాంకేతిక సూచికల అండతో మరింత భారీ లాభాల బాట పట్టడం ఖాయం అని అంచనా వేస్తున్నారు. త్వరలోనే రూ. 3 లక్షల మార్క్ ను దాటవచ్చంటున్నారు.