Gold Rate | బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో నేడు ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold Rate | బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల భారీగా పెరిగాయి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారానికి డిమాండ్‌ పెరిగింది. తాజాగా బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిస్తున్నాయి. సోమవారం బులియన్‌ మార్కెట్‌లో ధర తగ్గుముఖం పట్టింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గి తులానికి రూ.67,150కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి తులానికి రూ.73,250కి దిగివచ్చింది.

Reported by: Mallanna | వాణిజ్యం | May 13, 2024, 10:26 am IST
Read Time: 3 mins
Gold Rate | బంగారం కొనాలనుకుంటున్నారా..? తెలుగు రాష్ట్రాల్లో నేడు ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?

Gold Rate | బంగారం ధరలు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల భారీగా పెరిగాయి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారానికి డిమాండ్‌ పెరిగింది. తాజాగా బంగారం ధరలు కొనుగోలుదారులకు స్వల్ప ఊరటనిస్తున్నాయి. సోమవారం బులియన్‌ మార్కెట్‌లో ధర తగ్గుముఖం పట్టింది. 22 క్యారెట్ల బంగారంపై రూ.100 తగ్గి తులానికి రూ.67,150కి తగ్గింది. 24 క్యారెట్ల బంగారం రూ.100 తగ్గి తులానికి రూ.73,250కి దిగివచ్చింది.

దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం రూ.67,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,360కి తగ్గింది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.67,150 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.73,250కి దిగివచ్చింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పుత్తడి రూ.67,300 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.73,380కి చేరింది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి రూ.67,150 ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.73,250 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

మరో వైపు వెండి ధర భారీగానే తగ్గుముఖం పట్టింది. రూ.500 వరకు తగ్గగా.. ఢిల్లీలో కిలో రూ.86,500కి పతనమైంది. హైదరాబాద్‌లో రూ.90వేలకు దిగివచ్చింది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.