విధాత, హైదారబాద్ : ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో బంగారం, వెండి ధరల హెచ్చుతగ్గులు కొనసాగుతున్నాయి. బంగారం స్వల్ప పెరుగుదలను నమోదు చేయగా…కిలో వెండి ధర ఒక్కసారిగా రూ.15,000పతనమైంది. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 160 పెరిగి రూ. 1,44,710వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 150పెరిగి రూ. 1,32,650వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 15,000తగ్గి రూ. 2,45,000కు పడిపోయింది.
సురక్షిత పెట్టుబడుల మార్గంగా ఉన్న బంగారం, వెండి ధరలు రెండు నెలలుగా తీవ్ర హెచ్చుతగ్గులతో అస్థిరంగా కొనసాగుతుండటం మార్కెట్ వర్గాలను, కొనుగోలుదారులను గందరగోళానికి గురి చేస్తుంది. గత వంద ఏళ్ల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వరుసగా పది రోజుల పాటు బంగారం ధరలు క్షీణించడం పెట్టుబడిదారులను విస్మయానికి గురిచేస్తోంది. బ్లూమ్‌బెర్గ్ నివేదికల ప్రకారం.. జనవరిలో నమోదైన గరిష్ఠ స్థాయిల నుండి బంగారం ధర ఏకంగా 27 శాతం మేర పడిపోయింది. ప్రస్తుతం ఇది 4,090 డాలర్ల వద్ద నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. పసిడి ధరలు ఎందుకు పడిపోతున్నాయన్న అంశంపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
బంగారం ధరల పతనానికి లాభాల స్వీకరణ, పశ్చిమాసియా యుద్దం, ట్రేడర్ల నిర్ణయాల్లో మార్పులు, డాలర్ బలపడటం, వడ్డీరేట్ల నిర్ణయాలు, అంతర్జాతీయంగా ఉత్పత్తి, సరఫరా తేడాలు వంటి కారణాలు ప్రభావితం చేస్తున్నాయి. వరుస పతనం అనంతం రెండు రోజుగా పసిడి మళ్లీ 2 శాతం కోలుకుంది. ఇది పతనం ఆగిపోవడానికి సంకేతమా లేక తాత్కాలిక విరామమా అనేది వేచి చూడాల్సిందేనంటున్నారు నిపుణులు. మరికొన్ని నెలలు బంగారం, వెండి ధరలు హెచ్చుతగ్గుల ర్యాలీ కొనసాగినప్పటికి.. దీర్ఘకాలికంగా మాత్రం పెరుగుదల తప్పదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
Ram Charan | చరణ్ గొప్పతనంపై జానీ మాస్టర్ ఎమోషనల్ కామెంట్స్ .. 2వేల మందికి ఇన్సూరెన్స్ చేయించారు..
Liquor sales at Petrol Bunks | ఇకపై పెట్రోల్ బంకుల్లో మద్యం లభ్యం..! ఏప్రిల్ 1 నుంచి అమలు..!!
