Ram Charan | చ‌ర‌ణ్ గొప్ప‌త‌నంపై జానీ మాస్టర్ ఎమోషనల్ కామెంట్స్ .. 2వేల మందికి ఇన్సూరెన్స్ చేయించారు..

Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ (మార్చి 27) తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

  • By: Sandeep |    movies |    Published on : Mar 27, 2026 12:15 PM IST
Ram Charan | చ‌ర‌ణ్ గొప్ప‌త‌నంపై జానీ మాస్టర్ ఎమోషనల్ కామెంట్స్ .. 2వేల మందికి ఇన్సూరెన్స్ చేయించారు..

Ram Charan | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇవాళ (మార్చి 27) తన పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఈ రోజును పండుగలా జరుపుకుంటుండగా, అనేక ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు.

చరణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున అన్నదానం, రక్తదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తమ అభిమాన హీరో పుట్టినరోజును సేవా దినోత్సవంగా మార్చడం ద్వారా మెగా ఫ్యాన్స్ మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

జానీ మాస్ట‌ర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

ఇక గురువారం (మార్చి 26) జరిగిన స్పెషల్ బర్త్‌డే ఈవెంట్ కూడా గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకల్లో పలువురు సినీ ప్రముఖులు, మెగా అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చరణ్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. “డ్యాన్సర్లు ఎంత కష్టపడతారో మా చరణ్ అన్నకు బాగా తెలుసు. అందుకే వారికి ఇన్సూరెన్స్ చేయిస్తానని చెప్పి, అడిగిన వెంటనే రూ.40 లక్షలు సహాయం చేశారు. ఇది కేవలం డబ్బు కాదు.. 600 కుటుంబాల ఆరోగ్య భద్రత. దాదాపు 2000 మందికి ఇన్సూరెన్స్ కల్పించారు” అంటూ ఆయన గొప్పతనాన్ని కొనియాడారు.

మేము చ‌ర‌ణ్‌కి రుణ‌ప‌డి ఉంటాం..

ఇలాంటి కాలంలో చిన్న సహాయం చేయడమే కష్టమైపోయిందని, కానీ చరణ్ మాత్రం అడిగిన వెంటనే పెద్ద మొత్తంలో సాయం చేయడం ఆయన మనసు ఎంత గొప్పదో చూపిస్తుందని జానీ మాస్టర్ పేర్కొన్నారు. డ్యాన్సర్స్ యూనియన్ మొత్తం చరణ్‌కు రుణపడి ఉంటుందని, అలాంటి వ్యక్తిని అందించిన చిరంజీవి గారిని ఎప్పటికీ మర్చిపోలేమని అన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్నారు. ఈ విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, సత్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.అన్ని అనుకున్నట్లు జరిగి ఉంటే ‘పెద్ది’ సినిమా ఇప్పటికే విడుదలై ఉండేది. అయితే కొన్ని కారణాల వల్ల వాయిదా పడిన ఈ చిత్రం ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.