Gold-Silver Rates | పసిడి కొనుగోలుదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లోనే బంగారం ధరలు ఇవే..

Gold-Silver Rates | బంగారం కొనుగోలుదారులకు ధరలు ఊరట కల్పిస్తున్నాయి. నిన్న మార్కెట్‌లో భారీగా తగ్గిన ధర ఆదివారం బులియన్‌ మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నది. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.67,800 వద్ద కొనసాగుతున్నది. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.73,970 వద్ద నిలకడగా ఉన్నది.

Gold-Silver Rates | పసిడి కొనుగోలుదారులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లోనే బంగారం ధరలు ఇవే..

Gold-Silver Rates | బంగారం కొనుగోలుదారులకు ధరలు ఊరట కల్పిస్తున్నాయి. నిన్న మార్కెట్‌లో భారీగా తగ్గిన ధర ఆదివారం బులియన్‌ మార్కెట్‌లో నిలకడగా కొనసాగుతున్నది. 22 క్యారెట్ల గోల్డ్‌ తులానికి రూ.67,800 వద్ద కొనసాగుతున్నది. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.73,970 వద్ద నిలకడగా ఉన్నది. దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.68,350 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.74,570 వద్ద టేడ్రవుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల రూ.67,800 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.73,970 వద్ద స్థిరంగా ఉన్నది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం రూ.67,950 ఉండగా.. 24 క్యారెట్ల పుత్తడి రూ.74,120 వద్ద కొనసాగుతున్నది.

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్‌ రూ.67,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం పసిడి రూ.73,970 వద్ద నిలకడగా ఉన్నది. ఏపీలోని తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు పలుకుతున్నాయి. ఓ వైపు వెండి సైతం స్థిరంగా ఉన్నది. ఢిల్లీలో కిలో ధర రూ.91,500 వద్ద కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో కిలో రూ.96వేలు పలుకుతున్నది. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ పరిణామాలపైనే ధరలు ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలోనే అంతర్జాతీయంగా ధరలు పెరిగినా, తగ్గినా ఆ ప్రభావం భారత మార్కెట్లపై సైతం ఉంటుంది. ద్రవ్యోల్బణం, సెంట్రల్‌ బ్యాంకుల నిర్ణయాలు, వడ్డీ రేట్లలో మార్పులు, మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్‌ తదితర కారణాల నేపథ్యంలో బంగారం ధరలు మారుతూ వస్తుంటాయి.